Shruti Haasan Satires on Calling Aunty శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. శ్రుతి హాసన్‌ చేసే కామెంట్లు, నెటిజన్లకు ఇచ్చే రిప్లైలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తన ప్రియుడు శంతనుతో కలిసి శ్రుతి హాసన్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. శ్రుతి హాసన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో అలా వెయిట్ చేస్తున్నానని, ఏమైనా ప్రశ్నలు అడగండని అనేసింది శ్రుతి హాసన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో రకరకాల ప్రశ్నలను శ్రుతి హాసన్ మీద కురిపించారు. అందులో ఒక నెటిజన్ నువ్ మాకు కావాలి ఆంటీ అని అడిగేశాడు. దీంతో శ్రుతి హాసన్ తన స్టైల్లో సమాధానం ఇచ్చింది. నేను షూటింగ్‌లంటూ అటూ ఇటూ తిరుగుతు ఫుల్ బిజీగా ఉన్నాను.. తిన్నది కూడా సరిగ్గా అరగడం లేదు.. అందరూ యూత్ అంతా కూడా మీరు ఇంత బిజీగా ఎలా ఉంటున్నారు ఆంటీ అని అడుగుతుంటారు.. అని శ్రుతి హాసన్ ఆ కామెంట్లను లైట్ తీసుకుంది.


ఇక మరో నెటిజన్ మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని అడిగాడు. శ్రుతి హాసన్ ఈ ప్రశ్నకు వింత సమాధానం ఇచ్చింది. ఈ ప్రశ్న విని విని బోర్ కొడుతోందంటూ నిట్టూర్పు విడిచింది. అయితే పెళ్లి మీద మాత్రం శ్రుతి హాసన్ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. శంతనుతో గత కొన్నేళ్లుగా డేటింగ్‌లోనే ఉన్న శ్రుతి హాసన్ పెళ్లికి మాత్రం సిద్దపడటం లేదనిపిస్తోంది.


[[{"fid":"264531","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మొన్నామధ్య శ్రుతి హాసన్ పెళ్లి మీద కోలీవుడ్ మీడియాలో రకరకాల రూమర్లు వచ్చాయి. వాటిపై శ్రుతి హాసన్ స్పందించింది. అలాంటిదేమీ లేదని, ఇప్పుడే పెళ్లి చేసుకోను అంటూ సమాధానం ఇచ్చింది. ఇక శ్రుతి హాసన్ ఇప్పుడు సినిమాల మీదే ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది.


[[{"fid":"264533","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


అసలే శ్రుతి హాసన్ ఈ సంక్రాంతికి హిట్ల మీద హిట్లు కొట్టేసింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక ప్రభాస్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమా బాకీ ఉంది. అది కూడా ఈ ఏడాది థియేటర్లోకి వస్తుందన్న సంగతి తెలిసిందే.


Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా


Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook