Shruti Haasan Self Care దేశ ముదురు సినిమాలో పూరి జగన్నాథ్ తన హీరోయిన్‌తో ఓ డైలాగ్ చెప్పిస్తాడు. ఇది శరీరం కాదు.. ఇదంతా మట్టి అంటూ ఇలా ప్రవచనాలు ఇప్పిస్తుంటాడు. కానీ కొందరు మాత్రం తమ శరీర సంరక్షణ కోసమే సమయాన్ని వెచ్చిస్తుంటారు. సెలెబ్రిటీలు అయితే కచ్చితంగా తమ శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా హీరోయిన్లు అయితే సెల్ఫ్ బాడీ కేరింగ్‌ తీసుకుంటారు. ఇప్పుడు శ్రుతి హాసన్‌ కూడా అదే విషయాన్ని చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాదిలో ఎక్కువగా తన బాడీ మీద, తన గురించి ఎక్కువగా కేటాయించుకోవాలని చూసుకుంటోందట. ఈ మేరకు తన బాడీకి సరిపోయే మంచి ప్రొడక్ట్‌లను ఇచ్చే సంస్థ గురించి చెప్పింది. తన చర్మానికి అవసరమైనటు వంటి ఉత్పత్తులను ఇస్తుందట సదరు సంస్థలు. ఫేస్ మసాజ్ చేసుకుంటూ ఉంటే.. మెడిటేషన్ చేసినంత ప్రశాంతంగా ఉందట. 


తన గురించి తాను ఇలా సెల్ఫ్ కేరింగ్ తీసుకోవడం బాగుందట. తాను అసలే చాలా పని చేస్తానని, ఎక్కువగా చెమటోడ్చుతానని నిజంగానే తాను ఎక్కువగా పని చేస్తానని చెప్పుకొచ్చింది. నాకు నా చర్మం, నా గుండె, నా మైండ్ ఇలా నా పూర్తి శరీరాన్ని ప్రేమిస్తున్నాను అంటూ శ్రుతి హాసన్ తెలిపింది.


[[{"fid":"262725","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


శ్రుతి హాసన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. సంక్రాంతికి టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మారింది. బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా హిట్ కాగా.. చిరు వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో శ్రుతి హాసన్‌ ఖాతాలో రెండు హిట్ సినిమాలు పడ్డట్టు అయింది. ఇకపై ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమా మీద శ్రుతి హాసన్ ఫోకస్ పెట్టేసింది.


ఈ మధ్యే శంతను, శ్రుతి హాసన్ పెళ్లి మీద కోలీవుడ్‌లో ఎక్కువగా రూమర్లు వచ్చాయి. అయితే వాటిని శ్రుతి హాసన్ ఖండించింది. ఇప్పట్లో పెళ్లి చేసుకోనంటూ.. తేల్చి చెప్పేసింది శ్రుతి హాసన్. ఇక వాలెంటైన్స్ డే స్పెషల్‌గా శంతను మీదున్న ప్రేమను కురిపించింది శ్రుతి హాసన్.


Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు


Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook