గోల్కోండ హైస్కూల్, ఊపిరి వంటి సినిమాల్లో టీనేజ్ బాయ్ పాత్రల్లో నటించిన శ్రీనివాస సాయి ప్రధాన పాత్రలో రూపొందిన శుభలేఖలు సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇవాళే ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా రిలీజైంది. నేటితరం యువతీ, యువకుల లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన శుభలేఖలు సినిమాను శరత్ నర్వాడే డైరెక్ట్ చేయగా విద్యాసాగర్, ఆర్ఆర్ జనార్థన్ నిర్మించారు.