Siddharth – Aditi Pic: మహాసముద్రం సినిమాతో ఒకరికొకరు పరిచయమైన సిద్ధార్థ.. అదితి రావ్ హైదరి అప్పటి నుంచే ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీరిద్దరూ ఎప్పుడు దీని గురించి అఫీషియల్ గా మాట్లాడలేదు. అయితే వీరిద్దరూ చేసే పనులు అలానే వీరిద్దరూ షేర్ చేసే ఫోటోలు మాత్రం.. వీరి ప్రేమను చెప్పకనే చెబుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా తమతో పాటు మహాసముద్రం సినిమాలో నటించిన హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి వీరిద్దరూ కలిసి జంటగా రావాలంటే అందరూ వీళ్లిద్దరూ కూడా త్వరలోనే పెళ్లి అనౌన్స్ చేస్తారు అని కామెంట్లు పెడుతూ వచ్చారు..ఇక అందరికి ఎలానో తెలిసిపోయింది కదా అని ఉద్దేశంతో ఈ మధ్య ఇద్దరూ కలిసి ఓపెన్ గానే తిరిగేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వీరు షేర్ చేసే ఫోటోలకు వీడియోలకు అసలు కండిషన్లు కూడా లేవు.


ఇటీవల సిద్దార్థ చిన్నా సినిమా బాలీవుడ్ ప్రీమియర్ కి అదితి దగ్గరుండి అన్ని చూసుకుంది. అంతేకాదు పుట్టిన రోజులకు.. ఏదైనా స్పెషల్ డేస్ కి ఒకరికొకరు తమ సోషల్ మీడియాలో స్పెషల్ విషెష్ చెప్తున్నారు. దీంతో వీరిద్దరూ చెప్పకపోయినా వీరు రిలేషన్ లో ఉన్నారని అందరూ క్లారిటీతో ఉన్నారు.


తాజాగా న్యూ ఇయర్ కి విదేశాల్లో ఇద్దరూ కలిసి క్లోజ్ గా దిగిన ఓ ఫోటో షేర్ చేసి అదితి రావ్ హైదరి విషెష్ చెప్పారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఇద్దరూ కలిసి ఫోటో పోస్ట్ చేయడంతో అధికారికంగా వీరి రిలేషన్ ని ప్రకటించారా? త్వరలో పెళ్లి చేసుకుంటున్నారా? అంటూ ఆ పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు.



కాగా వీరిద్దరికి కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. గతంలో సిద్దార్థ్ మేఘన నారాయణన్ అనే అమ్మాయిని వివాహం చేసుకోగా ఆ తర్వాత విడాకులు అయ్యాయి. అంతేకాదు సిద్ధార్థ శృతిహాసన్ ని.. సమంత ని ప్రేమించారని కూడా రూమర్స్ ఉన్నాయి. మరోపక్క అదితి కూడా సత్యదేవ్ మిశ్రా అనే నటుడ్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత కొన్నాళ్ళకు విడాకులు తీసుకుంది. కాబట్టి వీరిద్దరూ ఇప్పుడు మళ్లీ రెండో పెళ్లి చేసుకుంటారా లేకపోతే డేటింగ్ నీ కంటిన్యూ చేస్తారా తెలియాలి అంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాలి.


Also read: PPF Benefits: నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి 26 లక్షలు పొందే అద్భుత పధకం


Also read: Japan Earthquake: న్యూ ఇయర్ నాడు జపాన్‌ను వణికించిన భారీ భూకంపం, ఫోటోలు వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook