Siddhu Jonnalagadda: టిల్లు క్యూబ్ కథ బయటపెట్టిన హీరో.. ఈసారి రాధిక యూనివర్స్ లేనట్టే
Tillu Square Sequel: సిద్ధు జొన్నలగడ్డ హీరో గా డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు టిల్లు క్యూబ్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా కథ విషయంలో సిద్దు జొన్నలగడ్డ చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
Tillu Cube : చిన్న బడ్జెట్ సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ ఆయన సినిమాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. కానీ అలాంటి సినిమాలకి సీక్వెల్స్ కూడా వచ్చి అవి కూడా బ్లాక్ బస్టర్లు అయిన వైనాలు తక్కువ అనే చెప్పుకోవాలి. అలాంటి కోవ కే చెందుతుంది డీజే టిల్లు సినిమా. టిల్లు క్యారెక్టర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.
డీజే టిల్లు సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమాకి సీక్వల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాతో కూడా ఇప్పుడు మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టిల్లు ఫ్రాంచైజ్ ఇంకా కొనసాగాలి అని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే టిల్లు క్యూబ్ సినిమా కూడా ఉండబోతోంది అని హింట్ ఇచ్చేశాడు సిద్ధు. మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో కూడా రివిల్ చేసేసాడు ఈ యువ హీరో.
అయితే డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల లాగా కాకుండా ఈ సినిమా కథ వేరేగా ఉండబోతుందట. ఈసారి టిల్లు క్యారెక్టర్ ఎవరో అమ్మాయి వెనుక పడి మళ్లీ ఇబ్బందుల్లో ఇరుక్కోకుండా ఈసారి టిల్లు పాత్రకి ఒక సూపర్ పవర్ వస్తుందని దానిని టిల్లు ఎలా ఉపయోగిస్తాడు అనేది చాలా ఎంటర్టైనింగ్ గా చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటిదాకా ఈ రెండు సినిమాల్లో కనిపించిన రాధిక, లిల్లీ క్యారెక్టర్లు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. మరి టిల్లు క్యూబ్ సినిమాలో ఈ ట్విస్ట్ ని ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు మాత్రం ఇంకొక అమ్మాయి పాత్రని తీసుకువచ్చినా కూడా కథ బాగా రొటీన్ అయిపోతుందని ఇలాంటి ట్విస్ట్ ఉంటేనే బాగుంటుంది అని కామెంట్లు చేస్తున్నారు. ఒకరకంగా ఇది రిస్క్ అని చెప్పుకోవచ్చు కానీ వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి టిల్లు క్యూబ్ సినిమా కథ విషయంలో సిద్ధు జొన్నలగడ్డ తీసుకోబోతున్న ఈ రిస్క్ తన కెరియర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలో రేపో ఎప్పుడూ కూలుతుందో..? హరీశ్ రావు సందేహం
Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్: కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook