Tillu Cube: గుంటూరు టాకీస్ సినిమాతో మంచి విజయం అందుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆ చిత్రంలో ఈ హీరో కామెడీ ఎంతో బాగా పండించినా.. ఎందుకనో పెద్దగా పేరు మాత్రం రాలేదు. ఆ తరువాత కూడా పలు సినిమాలలో కనిపించాడు. కానీ ఏ చిత్రం కూడా సిద్దుకి అనుకున్నంత రేంజ్ లో పేరు తెచ్చి పెట్టలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022 లో విడుదల అయిన డీజే టిల్లు సినిమా మాత్రం సిద్దు కి ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది. తన సొంత పేరుతో కంటే టిల్లు అంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. డీజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ప్రకటించారు. సీక్వెల్స్ పెద్దగా వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు లేవు అని కొందరు అంటూనే ఉన్నారు కానీ వారి నోర్లు మూయిస్తూ టిల్లు స్క్వేర్ కూడా మరొక బ్లాక్ బస్టర్ అయ్యింది. 


ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమాకి మూడవ భాగం కూడా రెడీ అవుతోంది. టిల్లు క్యూబ్ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో కథ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని ముందు నుండి టాక్ వినిపిస్తోంది. తాజాగా సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 


తాజా సమాచారం ప్రకారం టిల్లు క్యూబ్‌ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ హీరో ఎవరు? ఎలాంటి పాత్రలో కనిపిస్తారు అనే విషయాల మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఆ హీరోది ప్రత్యేక పాత్ర లేక కేవలం అతిధి పాత్ర అని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరైనా సీనియర్ హీరో ఈ కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది అని సమాచారం. 


టిల్లు క్యూబ్ సినిమాని త్వరలో మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా మీద అప్పుడే బోలెడు అంచనాలు నెలకొన్నాయి. సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఇక టిల్లు క్యూబ్ తో నాగవంశీ ఈ సారి 200 కోట్లు వసూళ్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ జాక్ సినిమాలో నటిస్తున్నారు. జులై, ఆగష్టు లో ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమా విడుదల తర్వాత టిల్లు క్యూబ్ గురించి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Also read: Strawberries Health: స్ట్రాబెర్రీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook