Tillu Sqaure: టిల్లు స్క్వేర్ నిడివి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…సిద్దు జొన్నలగడ్డ సూపర్ స్కెచ్!
Tillu Sqaure Run Time: వెరైటీ కాన్సెప్ట్ తో.. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ. అతను నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Siddhu Jonnalagadda: వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆ మధ్య ఈయన నటించిన డీజే టిల్లు చిత్రం చిన్న సినిమాగా వచ్చి కూడా విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న టిల్లు స్క్వేర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్స్ మూవీ పై అంచనాలను భారీగా పెంచాయి. ఈ చిత్రంలో ఉన్న ఘటైన రొమాంటిక్ సీన్స్ యూత్ కు ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.
డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా రాబోతున్నట్లు టిల్లు స్క్వేర్ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు డీజే టిల్లు కంటే రెట్టింపు గా ఉంటాయి అన్న విషయం పోస్టర్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఓ రేంజ్ ఘాటైన సన్నివేశాలతో భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో రాధికను మించి అనుపమ పరమేశ్వరన్ కుర్రకారును ఫిదా చేయబోతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టిల్లు స్క్వేర్ చిత్రానికి సంబంధించిన రన్ టైం డీటెయిల్స్ బయటకు వచ్చాయి. గత కొద్ది కాలంగా సినిమా రన్ టైం సుమారు 3 గంటలు వరకు ఉంటుంది. అయితే వీటికి భిన్నంగా టిల్లు స్క్వేర్ రన్ టైం కేవలం 2 గంటల 4 నిమిషాలు మాత్రమే కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మంచి పవర్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చే ఈ చిత్రంకి ఇంత తక్కువ రన్ టైం ఉండటం డెఫినెట్గా పెద్ద పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. మరి ఎక్కువ రన్ టైం ఉంటే సినిమా సాగదీసినట్లుగా ఉంటుంది.. దాని ప్రభావం కలెక్షన్స్ పై ఖచ్చితంగా పడుతుంది. అందుకే టిల్లు స్క్వేర్ చిత్ర బృందం మొత్తం సినిమాని రెండు గంటలలో ముగించినట్లు టాక్. ముఖ్యంగా సిద్ధూ ఈ సినిమాకి తక్కువ రన్ టైం ఉండాలి అని పట్టు పట్టినట్లు.. అందుకే అవసరం లేని కొన్ని సన్నివేశాలు తీసేసి కరెక్ట్ గా రెండు గంటల నాలుగు నిమిషాల టైం ఈ చిత్రానికి పెట్టినట్లు వినికిడి.
ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టును ఇప్పటికే చాలా సార్లు మార్చినట్లు వార్తలు వచ్చాయి. డీజే టిల్లు కి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుంచి భారీగా ఉండడంతో చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. సీక్వెల్ మీద ఉన్న అంచనాలు మిస్ అయితే సినిమా ఫెయిల్ అవ్వక తప్పదు కాబట్టి సిద్దూ దగ్గర ఉండి మరి ఈ చిత్రానికి సంబంధించి ప్రతి ఒకటి జాగ్రత్తగా ప్లాన్ చేశాడట. ఈ నేపథ్యంలో కేవలం రెండు గంటల్లో ప్రేక్షకులను నవ్విస్తూ థ్రిల్ కి గురిచేసి మెప్పించాలని ఫిక్స్ అయినట్లు టాక్. మరి డీజే టిల్లు రికార్డుని టిల్లు స్క్వేర్ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ తప్పదా?
Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్, రుణమాఫీ ఎప్పటినుంచంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook