SIIMA Awards Winners Full List: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుక దుబాయ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ నెల 15, 16వ తేదీల్లో జరుగుతున్న ఈ వేడుకల్లో తెలుగు, కన్నడ పరిశ్రమలకు చెందిన నటీనటులు విచ్చేశారు. టాలీవుడ్ స్టార్స్ రానా, మంచు లక్ష్మీ హోస్టులుగా వ్యవహరించిన ఈ వేడుకపై నటీనటులు ట్రెండీ దుస్తుల్లో తళుక్కున మెరిశారు. సౌత్ ఇండస్ట్రీకి సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించేందుకు సైమా అవార్డుల వేడుకను గత పదేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈసారి 11వ వేడకను అట్టహాసంగా నిర్వహించారు. మొదటి రోజు (సెప్టెంబర్‌ 15) తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల కార్యక్రమం పూర్తి అయింది. శనివారం (సెప్టెంబర్‌ 16) తమిళం, మలయాళం పరిశ్రమలకు చెందిన వేడుకలు జరుగుతాయి. ఆర్ఆర్ఆర్ నటనకు గానూ ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడి అవార్డు వరించింది. ధమకా చిత్రంలో నటనకు శ్రీలీల ఉత్తమ నటిగా ఎంపికైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సైమా 2023 అవార్డుల విజేతల వివరాలు ఇలా..


==> ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (RRR)
==> ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
==> ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (RRR)
==> ఉత్తమ చిత్రం: సీతా రామం 
==> ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్‌)
==> ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
==> ఉత్తమ విలన్‌: సుహాస్‌ (హిట్‌ 2)
==> ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ 2)
==> ఉత్తమ నూతన నిర్మాతలు (తెలుగు): శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)
==> ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
==> ఉత్తమ సంగీత దర్శకుడు: MM కీరవాణి (RRR)
==> ఉత్తమ సినిమాటోగ్రఫీ: KK సెంథిల్‌ కుమార్‌ (RRR)
==> ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు RRR)
==> ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (DJ టిల్లు)
==> ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)
==> సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2
==> ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడవి శేష్‌ (మేజర్‌)
==> ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
==> ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌
==> ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తెలుగు): బెల్లంకొండ గణేష్‌


Also Read: Telangana Medical Colleges: దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్యరంగం.. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్


Also Read:  Nipah Virus Cases: కేరళలో హై అలర్ట్.. 6కి చేరిన నిఫా వైరస్ కేసులు, ఇద్దరు మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook