Singer Chinmayi Video : టైట్‌గా ఉంటేనో నొప్పి వస్తేనో రక్తం కారితేనో వర్జిన్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన వీడియో
Singer Chinmayi On First Experience సింగర్ చిన్మయి తాజాగా ఓ ట్రోలింగ్ మీద స్పందించింది. ఆడవాళ్లలో తొలి కలయికకు సంబంధించిన కొన్ని అపోహలుంటాయని, కొన్ని ఆధారాలను పట్టి మగవాళ్లు కొన్ని ఊహించుకుంటారని చెప్పుకొచ్చింది.
Singer Chinmayi On First Experience సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో స్పందించే విషయాలు, ఇచ్చే వివరణలు, చెప్పే సూక్తులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల మీద నిర్మొహమాటంగా స్పందిస్తూ ఉంటుంది. మహిళల పర్సనల్ విషయాలను సైతం ఎంతో ధైర్యంగా, బహిరంగంగానే వాదిస్తుంటుంది. సింగర్ చిన్మయి ఇప్పుడు తొలి కలయిక మీదుండే అపోహలు, అమ్మాయిలను అబ్బాయిలు ట్రీట్ చేసే విధానం మీద స్పందించింది.
అమ్మాయిలకు తొలి కలయిక సమయంలో నొప్పి ఉంటుందని, రక్తం వస్తేనే వర్జిన్ అని, టైట్‌గా ఉంటేనే వర్జిన్ అని అంటుంటారని, అవన్నీ కేవలం అపోహలేనని చిన్మయి చెప్పుకొచ్చింది. దీని మేరకు ఓ ట్రోల్ వీడియోను షేర్ చేసి అసలు విషయాన్ని చెప్పింది. పెళ్లి కొడుకులు ఇలా ఊహిస్తారని, కానీ రియాల్టీలో ఇలా ఉంటుందని షేర్ చేసిన ట్రోల్ వీడియో మీద చిన్మయి మండి పడింది.
వెజినా (యోని) టైట్‌గా ఉంటేనో, రక్తం కారితేనో, నొప్పి వస్తేనో వర్జిన్ అని అపోహ పడుతుంటారని, కానీ అవన్నీ అబద్దాలని చెప్పుకొచ్చింది చిన్మయి. నిజానికి తొలి కలయిక సమయంలో అమ్మాయిలకు మరింత బాధ, నొప్పి అంటే అది వైద్య పరంగా పెద్ద సమస్య అని, వెంటనే చికిత్స తీసుకోవాలని చిన్మయి సూచించింది.
తొలి కలయిక సమయంలో మరీ టైట్‌గా ఉండి, నొప్పి వస్తే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని నొక్కి మరీ చెప్పింది. ఇలాంటి విషయాలను డిస్కస్ చేయడానికి సిగ్గు పడొద్దని, కానీ ఇప్పటి సమాజం అలానే వ్యవహరిస్తుంటుందని, ఇలాంటి విషయాలు ఇలా మాట్లాడతారా? అని మనల్నే తక్కువ చేసి చూస్తారని చిన్మయి చెప్పుకొచ్చింది.
ఇలా తొలి కలయిక మీద అబ్బాయిలు వేసే ట్రోల్స్, జోకులు, మీమ్స్ నిజం కాదని, అవన్నీ అపోహలేనని కొట్టి పారేసింది. ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే వైద్యులను సంప్రదించండని చిన్మయి సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read: Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!
Also Read: Nidhhi Agerwal : జోరు పెంచేసిన నిధి అగర్వాల్.. అదరహో అనాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook