Singer KK Death, Kolkata Police found Antacid strips in KKs hotel room: ప్రముఖ బాలీవుడ్‌ సింగర్ కృష్ణ కుమార్‌ కున్నథ్‌ (కేకే) ఆకస్మిక మరణం చెందిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి కోల్‌కతాలో లైవ్‌ ప్రదర్శన చేసిన కొద్దిసేపటికే కేకే అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయన అకాల మరణం సినీ, సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కేకే భౌతికకాయానికి నిన్న పోస్టుమార్టం నిర్వహించారు. అయితే అస్వస్థతకు గురైన సమయంలో కేకే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడ్డాయని, సరైన సమయానికి సీపీఆర్‌ చేసి ఉంటే బతికేవారేమో అని కోల్‌కతా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేకే గుండె రక్తనాళాల్లో పలు చోట్ల పూడికలు ఏర్పడడంతోనే ఆయనకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. 'కేకే గుండెలోని ఎడమ ధమనిలో పెద్ద బ్లాక్‌ ఏర్పడింది. ఈ నాళంలో దాదాపు 80 శాతం పూడిక ఉంది. లైవ్‌ షో సమయంలో విపరీతమైన ఉద్వేగం కారణంగా అతడి గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయి కార్డియాక్‌ అరెస్ట్‌కు దారితీసింది. ప్రదర్శన సమయంలో ఉత్సాహంగా ఉన్నా.. ఉద్వేగ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని నిమిషాల పాటు గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయింది. దీని ఫలితంగానే కేకే స్పృహ కోల్పోయి కార్డియాక్‌ అరెస్టుకు గురయ్యారు. వెంటనే ఆయనకు సీపీఆర్‌ చేసి ఉంటే బతికేవారేమో'అని చెప్పారు. 


ప్రదర్శనకు ముందు కేకే యాంటాసిడ్స్‌ తీసుకున్నారని పోస్టుమార్టంలో తేలినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు  కోల్‌కతా పోలీసు అధికారులు కేకే బస చేసిన హోటల్ గదిలో యాంటాసిడ్స్‌ స్ట్రిప్స్‌ను కనుగొన్నారు. కేకేకి గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, గ్యాస్ట్రిక్ సంబంధిత మందులను తరచుగా వాడేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. లైవ్ షోకి ముందు సింగర్ కేకే తన భుజాలు మరియు చేతుల్లో నొప్పిగా ఉందని భార్యతో చెప్పినట్లు తెలిసింది. ఇక హిస్టోపాథలాజికల్ నివేదిక వస్తే మరిన్ని వివరాలను తెలవనున్నాయి.


కేకే ఆగస్ట్‌ 23న 1968 న్యూఢిల్లీలో జన్మించారు. ఢిల్లీ మౌంట్‌ సెయింట్‌ మెరీస్‌ స్కూల్‌లో విద్యనభ్యసించారు. అనంతరం కేకే హోటల్ ఇండస్ట్రీలో మార్కెటింగ్‌ అసోసియేట్‌గా పని చేశారు. ఆ తర్వాత సంగీతంపై మక్కువతో ముంబైకి మకాం మార్చాడు. 1996లో ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వంలో వచ్చిన కాదల్‌ దేశం (ప్రేమ దేశం) చిత్రంతో నేపథ్య గాయకుడిగా కేకే పరిచయమయ్యాడు. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో హిందీలో 500కుపైగా.. తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళీ భాషల్లోనూ 200కుపైగా పాటలు పాడాడు. ఇంద్ర, సంతోషం, ఘర్షణ, గుడుంబా శంకర్‌, నువ్వే నువ్వే, సైనికుడు, ఆర్య, ఖుషి, జల్సా, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌, ప్రేమకావాలి లాంటి తదితర సినిమాల్లో పాటలు పాడారు. 


Also Read: SVP OTT Release Date: మహేష్ బాబు అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి ఎస్‌వీపీ! పైసల్ కట్టాల్సిన అవసరం లేదు


Also Read: వరుడు లేకుండా వివాహం చేసుకుంటున్న 24 ఏళ్ల యువతి.. గోవాలో హనీమూన్ ప్లాన్! చరిత్రలో ఇదే మొదటిసారి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook