Lata Mangeshkar health: విషమంగా లతా మంగేష్కర్ ఆరోగ్యం- వెంటిలేటర్‌పై చికిత్స!
Lata Mangeshkar health: దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమించింది. మరోసారి అమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు వైద్యులు.
Lata Mangeshkar health: ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించింది. అమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ముంబయిలోని బ్రిచ్ క్యాండీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
లతా మంగేష్కర్‌కు ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె ఆరోగ్యంపై వైద్యులు నిరంతం పర్యేవేక్షిస్తున్నట్లు వివరించారు.
కోవిడ్-19 సోకడంతో గత నెలలో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు లతా మంగేష్కర్. అప్పుడు కూడా అమె పరిస్తితి క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.
అయితే కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అమెకి ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స తీసుకుంటున్నారు. లతా మంగేష్కర్ వయసు 92 ఏళ్లు. అందుకే అమె కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఇతర సమస్యల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.
ఇక లతా మంగేష్కర్ ఆరోగ్యంపై అమె సోషల్ మీడియా టీమ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటుంది. పుకార్లను నమ్మోద్దంటూ సూచనలు కూడా చేస్తుంటుంది.
లతా మంగేష్కర్ గురించి..
భారత లెజెండరీ సింగర్స్‌లో లతా మంగేష్కర్ కూడా ఒకరు. క్వీన్ అఫ్ మెలోడిగా అమెను పిలుస్తుంటారు. 1942 నుంచి అమె పాటలు పాడుతున్నారు.
సంగీత కళలో.. అమె అందించిన సేవలకు గుర్తింపుగా.. 1969లో పద్మ భూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1997లో మహారాష్ట భూషణ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారత రత్న అందుకున్నారు. ఇవే కాక ఎన్నో ఫిల్మ్ఫేర్లు జాతీయ అవార్డులు అందుకున్నారు లతా మంగేష్కర్. హిందీ, మరాఠీ, బెంగాలీ సహా ఇతత ప్రాంతీయ భాషల్లోను అమె పాటలు పాడారు.
Also read: Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాలు, 75 మిలియన్ల వ్యూస్
Also read: Sridevi Remuneration: మెగాస్టార్ చిరంజీవితో సమానంగా పారితోషికం తీసుకున్న నటి ఎవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook