Singer Mano-Jabardasth Latest Promo : బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న ఎంటర్టైన్మెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈటీవీ, మల్లెమాల వంటి షోలు అయితే జనాలు తిడుతూనే చూస్తుంటారు. జబర్దస్త్ షోలో ఎంత వల్గారిటీ ఉంటుందో అందరికీ తెలిసిందే.  అడల్డ్ కంటెంట్ కామెడీతో టీఆర్పీల్లో దూసుకుపోతుంటుంది. అయితే కొన్ని సార్లు కామెడీ హద్దులు దాటుతుండటంతో వివాదాలు సైతం చుట్టు ముడుతుంటాయి.  జబర్దస్త్ ఆర్టిస్ట్‌లను సైతం కొంత మంది ప్రైవేట్‌గా చుట్టి ముట్టి కొట్టిన ఘటనలు కూడా వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుల సంఘాలు సైతం జబర్దస్త్ షో మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇక జబర్దస్త్ షోలో ఎన్నెన్నో మార్పులు వస్తూనే ఉన్నాయి. కంటెస్టెంట్లు, టీం లీడర్లు, జడ్జ్‌లు మారుతూనే వస్తున్నారు. జబర్దస్త్ నుంచి టాప్ సెలెబ్రిటీలంతా కూడా పోతూనే ఉన్నారు. నాగబాబు బయటకు వెళ్లినప్పటి నుంచి జబర్దస్త్ షోలో ఎన్నో మార్పులకు లోనవుతూనే ఉంది.


నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర వంటి వాళ్లు వెళ్లిపోయారు. ఆ తరువాత అదిరే అభి వెళ్లిపోయాడు. ఈ మధ్య సుధీర్, అనసూయ కూడా బయటకు వచ్చేశారు. ఆది కూడా కొన్ని రోజులు జబర్దస్త్‌కు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఈ మధ్య ఆది వెనక్కి వచ్చేశాడు. జబర్దస్త్ షో పని అయిపోయిందని అంతా అనుకున్నారు.


అందరూ బయటకు వెళ్లిపోవడంతో కొత్త వారికి కూడా టీం లీడర్లు చాన్స్ ఇచ్చారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. రోహిణి, బాబు వంటి వారు కొన్ని వారాల పాటు టీం లీడర్లుగా వ్యవహరించారు. అయితే జడ్జ్‌ల విషయంలో ఎన్నెన్నో మార్పులు చేర్పులు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.


రోజాకు మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ జడ్జ్ సీటును ఖాళీ చేసింది. ఆ స్థానంలో ఇంద్రజ వచ్చి చేరింది. అనసూయ ఖాళీ చేసిన స్థానంలో రష్మీ వచ్చింది. మధ్యలో సింగర్ మనో స్టార్ మా చానెల్‌లోకి వెళ్లాడు. అక్కడా ఇక్కడా అన్నట్టుగా కొన్ని రోజులు చేశాడు. మనో అలా గ్యాప్ ఇస్తుండటంతో.. కృష్ణ భగవాన్‌ను తీసుకున్నారు. అయితే ఆయన కూడా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తున్నారు.



ఆది ఈ షోలో వేసే డైలాగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేయడం, మింగుడు భాషను ఎక్కువగా వాడటం అతనికే చెల్లుతుంది. ఇక ఇప్పుడు మిగతా వారు కూడా ఆ మింగుడు భాషను వాడేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సింగర్ మనో, కమెడియన్ బాబులు రెచ్చిపోయారు. సింగుతా అని బాబు అంటే.. కుర్చీలో కూర్చున్న మనో.. నాకు ఓపిక లేకపోయినా నిన్ను అంటూ కాస్త గ్యాప్ ఇస్తాడు. ఆ తరువాత వచ్చే పదం ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా జబర్దస్త్ షోలో ఈ మింగుడు, సింగుతా భాష మాత్రం విచ్చలవిడిగా మారిపోయింది. చివరకు ఎన్నో సంగీత స్వరాలను పలికించిన సింగర్ మనో గొంతు నుంచి కూడా ఈ వెకిలి కామెడీ వచ్చేస్తోంది.


Also Read: Ponniyin Selvan 1 Movie Review : భారీ అంచనాలతో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ఎలా ఉందంటే?


Also Read: Karthikeya 2 OTT: నిఖిల్ 'కార్తికేయ 2' ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు, స్ట్రీమింగ్ ఎందులో..


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.