Siri Shrihan Marriage సిరి శ్రీహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్‌లో ఈ జోడి అందరినీ మెప్పించింది. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్‌లో అదరగొట్టేశారిద్దరూ. అయితే బిగ్ బాస్ ఇంట్లో సిరి ఉన్న సమయంలో శ్రీహాన్ బయట నుంచి సపోర్ట్ చేశాడు. షన్నుతో సిరి ఎన్ని వేషాలు వేసినా కూడా ఒక్క మాట కూడా అనలేదు. అది తప్పు ఇది తప్పు అని చెప్పలేదు.. ప్రేమతోనే నిన్ను స్వీకరిస్తా.. ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను అంటూ శ్రీహాన్ చెప్పిన మాటలు, స్టేజ్ మీద సిరి కోసం పాడిన పాటతో ఫేమస్ అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా ఐదో సీజన్‌లో సిరి కోసం బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన శ్రీహాన్..ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లో శ్రీహాన్‌కు కాస్త నెగెటివిటీ వచ్చింది. వెటకారం ఎక్కువ అయిందంటూ జనాలు బాగానే ఆడేసుకున్నారు. కానీ సిరి మాత్రం వాటిని కవర్ చేసే ప్రయత్నం చేసింది. శ్రీహాన్ గెలిచేందుకు ఎంత చేయాలో అంత చేసింది. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన సమయంలోనూ శ్రీహాన్‌కు మంచి సలహాలే ఇచ్చింది.


[[{"fid":"258881","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇక రొమాన్స్‌తో బిగ్ బాస్ ఇంట్లో హీటు పుట్టించేసింది. శ్రీహాన్‌ కోసం టాటూ వేయించుకోవడం, ఇంట్లో లిప్ లాక్ చేయడం వంటి చేసింది సిరి. అలా బిగ్ బాస్ ఆరో సీజన్‌లో సిరి శ్రీహాన్ రొమాన్స్ కూడా హాట్ టాపిక్ అయింది. బయటకు వచ్చాక కూడా ఈ ఇద్దరూ నానా హంగామా చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ నిర్మాతగా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది.


అయితే తాజాగా సిరి తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. ఓ నెటిజన్ పెళ్లి మీద ప్రశ్నలు కురిపించాడు. శ్రీహాన్ మీరు పెళ్లి చేసుకోండి. మాకు చూడాలని ఉంది.. అని అడిగేశాడు. దానికి సిరి త్వరలోనే చేసుకుంటాం అని చెప్పింది. కానీ ఎప్పుడు చేసుకుంటారో తేదీని మాత్రం క్లారిటీగా చెప్పలేదు. అంటే ఈ ఏడాదిలో ఈ జంట ఒక్కటయ్యే చాన్సులున్నాయని తెలుస్తోంది.


Also Read: Keerthy Suresh Bikini : బికినీలో కీర్తి సురేష్‌.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. హీటెక్కించే పిక్స్


Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి