Sita Ramam to Release on Amazon Prime: ఆగస్టు నెలలో టాలీవుడ్ లో మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి కళ్యాణ్ రామ్ నటించిన బిబిసారా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి అందులో సీతారాములు సినిమాకి సంబంధించిన ఓటీపీ రిలీజ్ డేట్ వచ్చేసింది. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ హీరో,హీరోయిన్లుగా నటించిన 'సీతారామం' సినిమాను హను రాఘవపూడి దర్శకత్వంలో తర్కెక్కించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించారు. ఇక రష్మిక మందన్నా, సుమంత్‌ సహా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా తొలి ఆట నుంచే హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా 32 రోజులకు గాను తెలుగులో 22 కోట్ల 86 లక్షల షేర్ వసూలు చేస్తే 40 కోట్ల 55 లక్షల గ్రాస్ సూసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల 34 లక్షల షేర్ వసూలు చేస్తే 86 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా మలయాళంలో కూడా మంచి వసూలు సాధించింది. ఈ హిట్ టాక్ తో హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయగా అక్కడ కూడా అనూహ్యమైన రెస్పాన్స్‌ వచ్చింది.


ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లుగా అమెజాన్‌ ప్రైమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ సంస్థ భారీ ధ‌ర‌ వెచ్చించి మరీ కొనుగోలు చేసినట్లు సమాచారం.