Sitaram Sitralu
బస్ స్టాప్, ఈ రోజుల్లో లాంటి చిన్న సినిమాలతో తన కెరియర్ మొదలు పెట్టిన మారుతి ప్రస్తుతం ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా చేసే రేంజ్ కి ఎదిగారు. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో కొత్త కాన్సెప్ట్ సినిమాలు తీయడమే కాకుండా ఎంతో మంది కొత్తవారిని కూడా ఎంకరేజ్ చేశారు. తాజాగా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న సీతారాం సిత్రాలు సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు ఈ డైరెక్టర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమా  సీతారాం సిత్రాలు.  లక్ష్మణ్ , కిశోరి దాత్రక్, భ్రమరాంబిక, హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మన పాత రోజులను గుర్తు చేస్తూ... పెళ్లి విసిఆర్ క్యాసెట్స్ పై రాబోతున్న సినిమా సీతారాం చిత్రాలు.  ఈ చిత్ర కాన్సెప్ట్  ట్రైలర్ ను దర్శకుడు మారుతి విడుదల చేశారు.


ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ...
‘సరికొత్త కథ, కథనాలు ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. వైవిద్యమైన కథ ఉన్న చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతాయి. సీతారాం చిత్రాలు టైటిల్, ట్రైలర్ చాలా కొత్తగా ఉంది అలానే ఈ రెండు కూడా చాలా  బాగున్నాయి. సినిమా విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను’ అని తెలియజేశారు .


షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లో విడుదల కానుంది అని ఈ చిత్రం మేకర్స్ తెలిపారు.


 



ఈ సినిమాలో లక్ష్మణ్, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్ తో పాటు ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి, సందీప్ వారణాశి, గురుస్వామి లాంటివారు ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణ చంద్ర విజయభట్టు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి కెమెరామెన్ గా అరుణ్ కుమార్ పర్వతనేని
బాధ్యతలు తీసుకోగా సంగీతాన్ని రుద్ర కిరణ్ అందిస్తున్నారు. BGM  శిరీష్ సత్యవోలు అందిస్తుండగా ఎడిటర్ గా ప్రణీత్ కుమార్ వ్యవహరిస్తున్నారు.


Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతాలు పెంపు


Also Read: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీకి ముందు సూపర్ గిఫ్ట్.. సర్‌ప్రైజ్ వచ్చేసిందిగా..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి