Sivakarthikeyan: క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్​ ప్రారంభించి.. హీరోగా ఇప్పుడు అగ్ర కథనాయకులకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తమిళ నటుడు శివ కార్తికేయన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే 'డాక్టర్' (తెలుగులో వరుణ్​ డాక్టర్​గా డబ్​ అయింది) సినిమాతో మంచి విజయాన్ని (Sivakarthikeyan Movies) అందుకున్నారు శివ కార్తికేయన్​. ఈ సినిమా రూ.100కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇదే ఊపులో మరిన్ని కొత్త సినిమాలు చేస్తున్నారాయన​. ప్రస్తుతం రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్​ దశలో ఉన్నాయి.


అయితే తాజాగా తెలుగులో ఓ సినిమా ప్రకటించారు (Sivakarthikeyan Telugu Movie) శివకార్తికేయన్​. 'జాతి రత్నాలు' సినిమా డైరెక్టర్ అనుదీప్ కేవీ (Anudeep KV next movie) దర్శకత్వంలో శివకార్తికేయన్​ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఏకకాలం చిత్రీకరణ జరుపుకోనున్నట్లు సమాచారం.


ఇంతకు ముందు తెలుగులో నటించినా..


నిజానికి ఇది వరకే తెలుగులో ఓ సినిమాలో నటించారు శివ కార్తికేయన్​. కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాలో నటించారు. అయితే అందులో శివకార్తికేయన్​ది పూర్తి స్థాయి పాత్ర కాదు. తక్కువ నిడివితో ఉంటే కీలక పాత్ర మాత్రమే. తెలుగులో హీరోగా అనుదీప్​ కేవీ తెరకెక్కించనున్న సినిమానే.. మొదటిది కానుంది.



అనుదీప్​కు రెండో సినిమా.. 


తెలుగులో జాతి రత్నాలు మంచి విజయం సాధించింది. మొదటి సినిమాతోనే అనుదీప్​ కేవీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే ఊపుతో సొంత కథతోనే శివకార్తికేయన్​తో సినిమా చేయనున్నారు అనుదీప్.


అనుదీప్​, శివకార్తికేయన్​ కాంబినేషన్​లో సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. అనుదీప్​కు ఇది రెండో సినిమాకాగా.. శివకార్తికేయన్​కు ఇది 20వ సినిమా.


మరిన్ని విశేషాలు..


ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్​, సురేశ్ ప్రొడక్షన్స్, శాంతి  టాకీస్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ్ దాస్ కే నారంగ్, సురేశ్​ బాబు, పుష్కర్​ రామ్​మోహన్ రావు ప్రొడ్యూసర్లు. తమన్​ మ్యూజిక్​ అందిస్తునారు. సినిమా ఇతర బృందంతో పాటు నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్​.


తమిళ స్టార్స్..​ తెలుగు సినిమా..


ఇటీవలి కాలంలో తమిళ స్టార్స్​ తెలుగులో నేరుగా సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే ధనుష్​ కూడా తెలుగులో స్ట్రెయిట్​ సినిమా ప్రకటించారు. 'సార్' అనే టైటిల్​తో ఈ సినిమా రానుంది. తమిళంలోనూ ఏక కాలంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.


Also read: Bigg Boss Telugu: తప్పుకున్న నాగార్జున.. బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా స్టార్ హీరో! ఇక ఎంటర్‌టైనింగ్‌ వేరే లెవల్‌!!


Also read: 83 Movie Review: 1983 ఇండియన్ టీమ్ కు సరైన ట్రిబ్యూట్ '83' మూవీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook