SJ Surya in RC15 : రామ్ చరణ్ సినిమాలో ఎస్జే సూర్య.. ఆ పాత్ర కోసమేనా?
SJ Surya joins the cast of RC15 Movie: ఆర్సీ 15 సినిమాలో ఇప్పటికే పలు స్టార్ నటీనటులు ఉండగా ఇప్పుడు మరో విలక్షణ నటుడు కూడా సినిమాలో భాగమయ్యారు.
SJ Surya joins the cast of RC15 Movie: రామ్ చరణ్ తేజ ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సూపర్ హిట్ సినిమా విడుదలైన కొన్ని రోజులకే విడుదలైన ఆచార్య సినిమా మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్ లోనే కాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కూడా మునుపెన్నడూ చూడని అపజయాన్ని ఈ సినిమా చూపించింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు.
రామ్ చరణ్ కెరియర్ లో 15వ సినిమాగా సంబోధించబడుతున్న ఈ సినిమాకు శంకర్ డైరెక్షన్ చేస్తున్నారు. అనేక భారీ బడ్జెట్ సినిమాలు, అద్భుతమైన సినిమాలు తెరకెక్కిస్తాడు అని పేరు ఉన్న శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేస్తూ ఉండడంతో ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ రెండు మూడు విభిన్న పాత్రలలో కనిపించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, రఘుబాబు, సముద్రఖని, జయరాం వంటి వాళ్ళు నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇప్పుడు ఈ సినిమాలో ఎస్ జె సూర్య కూడా నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసింది సినిమా యూనిట్. తమిళ్ నాట డైరెక్టర్ గా, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఎస్ జె సూర్య ఈ సినిమాలో భాగమవుతూ ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. గతంలో ఆయన తెలుగులో స్పైడర్ లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రలలో కనిపించారు. అయితే ఒక పాన్ ఇండియా తెలుగు ప్రాజెక్టులో భాగం అవడం ఆయనకు ఇదే మొదటిసారి.
ఇక ఈ సినిమా గురించి ఇలా అప్డేట్స్ తోనే ఆసక్తి పెంచేస్తున్నారు దర్శకనిర్మాతలు. చూడాలి మరి ఇంకా సినిమా నుంచి ఏమేమి అప్డేట్స్ రాబోతున్నాయి అనేది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ నిలించిందని ప్రచారం జరుగుతోంది.
Also Read: Amit Shah meetin Celebs: నిఖిల్ తో భేటీ కానున్న అమిత్ షా.. రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా?
Also Read: Nagarjuna vs Amala: పోటాపోటీగా అమల-నాగార్జున సినిమాలు రిలీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి