Harish Shankar Trolls Dil Raju Speech సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎందుకు ఫేమస్ అవుతుందో చెప్పలేం. ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో తెలియకుండా పోయింది. అయితే దిల్ రాజు ఈ మధ్య సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా వైరల్ అయ్యాడు. దళపతి విజయ్ వారిసు సినిమా ఈవెంట్‌లో దిల్ రాజు ఇచ్చిన తమిళ, ఇంగ్లీష్ మిక్స్డ్ స్పీచు ఎంతగా ట్రోల్ అయిందో అందరికీ తెలిసిందే. కామెడీ వెన్నమా కామెడీ ఇరుక్కుమ్.. అంటూ ఇలా సాగిన దిల్ రాజు స్పీచు.. అది దా సర్ అనే మాటతో ఎండ్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిల్ రాజు ఇచ్చిన స్పీచును అందరూ ఫాలో అయ్యారు. చివరకు రివ్యూలు చెప్పే వారు కూడా దిల్ రాజు స్టైల్‌లోనే అనేస్తున్నారు. ఓ పాప దిల్ రాజు స్టైల్లోనే రివ్యూని చెప్పింది. ఆ వీడియో కూడా బాగానే వైరల్ అయింది. అలా ఈ రెండు వారాలుగా దిల్ రాజు బాగానే ట్రోల్స్, మీమ్స్‌లో వైరల్ అవుతున్నాడు.


 



తాజాగా దిల్ రాజు స్పీచుని ట్రోల్ చేశారో.. సరదాగా వాడేసుకున్నారో తెలియడం లేదు గానీ.. ఎస్‌కేఎన్, హరీష్‌ శంకర్‌ల వీడియో వైరల్ అవుతోంది. సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మనాభం సినిమా ట్రైలర్ ఈవెంట్‌కు ఈ ఇద్దరూ ముఖ్య అతిథులుగా వచ్చారు. స్టేజ్ మీద ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. దిల్ రాజు స్టైల్లో మాట్లాడేశాడే. అన్ని ఇరుక్కుమ్‌లున్నాయ్ కాబట్టి.. ఈ సినిమాను అంతా చూడండి అని చెప్పుకొచ్చాడు.


ఇక ఎస్‌కేఎన్ స్పీచ్ తరువాత హరీష్‌ శంకర్ మైక్ అందుకుని.. అది దా ఎస్‌కేఎన్ అని అనేశాడు. అలా ఈ ఇద్దరూ అయితే దిల్ రాజు స్పీచును వాడేసుకున్నారు. అంటే ఆ స్పీచ్ ఎంతలా వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సెలెబ్రిటీలు సైతం ఆ ట్రోలింగ్ వీడియో, మీమ్స్‌లను చూసి బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.


Also Read:  Rakesh Sujatha Marriage : పెళ్లి చేసుకోబోతోన్న సుజాత రాకేష్.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పేసిన జోర్దార్ జంట


Also Read: Anchor Vishnupriya : బాలయ్య మీద విష్ణు ప్రియ కౌంటర్ వేసిందా?.. దండం పెట్టేసిన యాంకర్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook