Skylab Trailer: అంతరిక్ష పరిశోధన శాల.. స్కైల్యాబ్ నేలపై కూలుతుందని, అది నేలపై ఎక్కడ కూలితే అక్కడ విధ్వంసమేనని, ఒక ఊరు ఊరంతా నాశనం అయిపోతుందని ఇందిగా గాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయంలో చెలరేగిన పుకార్లలో ఒకటి. దేశం ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుంచుకునే ఈ విషయం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. స్కైలాబ్ తమపై కూలితే ఇక బతుకే అంతమైపోతుందనే భయంతో చివరిసారిగా పండగ చేసుకుందాం అని కోళ్లు, మేకలు కోసుకుని తిన్న వాళ్లూ లేకపోలేదు. అప్పట్లో తమకు పుట్టిన బిడ్డలకు కూడా స్కైలాబ్ రావు, స్కైలాబ్ రెడ్డి, స్కైలాబ్ కుమార్ అని పేరు పెట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్కైలాబ్ కూలిన ఆనాటి రోజులను మరోసారి గుర్తు చేసేలా తెరకెక్కిన సినిమానే స్కైలాబ్. విశ్వక్ కండేరావ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సత్యదేవ్, నిత్యామీనన్ (Satyadev and Nithya Menen) ప్రధాన పాత్రల్లో నటించారు. రాహుల్ రామకృష్ణన్, తనికెళ్ల భరణి, తరుణ్ భాస్కర్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. 


బండ లింగంపల్లి అనే ఊరిలో దొర కూతురిగా కనిపించనున్న నిత్యామీనన్ ఓ పాత్రికేయురాలి పాత్ర పోషించింది. సత్యదేవ్ పల్లెటూరిలో ఓ డాక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. స్కైలాబ్ ట్రైలర్ చూస్తే... మిగతా కథేంటో ఓ క్లారిటీ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. స్కైలాబ్ ట్రైలర్ (Sky lab trailer) చూసేయండి మరి.