Samantha: సినిమా వదిలేయాలి అనుకున్నాను.. లేటెస్ట్ సినిమా గురించి సమంత సెన్సేషనల్ వ్యాఖ్యలు..
Samantha Movies: అనారోగ్య కారణంగా కెరీర్ కు కాస్త బ్రేక్ తీసుకున్న సమంత మళ్ళీ తిరిగి వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో సిటాడెల్ కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్.
Samantha: టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంటర్ అయి అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన హీరోయిన్ సమంత.సినిమాలలోనే కాకుండా ఆమె వెబ్ సిరీస్ లో కూడా తన సత్తా చాటుకుంది.ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత.. తిరిగి మళ్ళీ ఇంకో వెబ్ సిరీస్ లో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.సమంత మయోసైటిస్ వ్యాధి కారణంగా తన సినీ కెరీర్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకోవడంతో తన చేతిలో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ తో తిరిగి మళ్ళీ బిజీగా మారింది. ప్రస్తుతం సామ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ ఒకటి.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ , సమంత కలిసి నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ సంస్ధ నిర్మిస్తోంది. ప్రియాంక చోప్రా నటించిన ఈ వెబ్ సీరీస్ హాలీవుడ్ వెర్షన్ కు మాంచి రెస్పాన్స్ రావడంతో ఇండియన్ వెర్షన్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.ఈ సిరీస్ కోసం సామ్ ఎంతో రిస్క్ తీసుకున్నట్లు టాక్. యాక్షన్ బేస్డ్ సీరీస్ కావడంతో ఇందులో భారీ రిస్కీ షాట్లను సమంత చేస్తోందట. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
అయితే తాజాగా సిటాడెల్ గురించి సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది.మైయోసైటిస్ వ్యాధితో పోరాడుతుండడం వల్ల తనకు సిటాడెల్ ప్రయాణం అంత సులభం కాలేదని పేర్కొంది. భారీ యాక్షన్స్ సన్నివేశాలు చేసేటప్పుడు తను సవాళ్లను ఎదుర్కొన్నానని.. కొన్ని సందర్భాలలో పాస్అవుట్ కూడా అయినట్లు ఆమె పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు యాక్టింగ్ పట్ల సమంత కు ఉన్న డెడికేషన్ ను పొగుడుతున్నారు.
సిటాడెల్ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో లో సామ్ తన స్టైల్ లుక్స్ తో అదరగొట్టింది. మరి ముఖ్యంగా యాక్షన్స్ సన్నివేశాలలో గన్ పట్టుకొని సమంత పోరాడే సీన్స్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక్క ట్రైలర్ వీడియో ఈ రకంగా ఉంటే మొత్తం సిరీస్ లో సమంత యాక్షన్ ఏ రేంజ్ లో దంచి కొట్టిందో అన్న టాక్ వినిపిస్తోంది. ఒకరకంగా హాలీవుడ్ సిరీస్ లో ప్రియాంక ను సమంత డామినేట్ చేసేంత అందంగా కనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత సమంతకు మరింత క్రేజ్ రావడం కన్ఫర్మ్ అనిపిస్తోంది.
Also Read: Nita Ambani Visited Balkampet Temple: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ ప్రత్యేక పూజలు..
Also Read: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్ మీడియా అతిథులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook