Sobhita: నాగచైతన్య, శోభిత పెళ్లి దుస్తులు సిద్ధం.. ప్రత్యేకత ఏమిటంటే..?
Naga Chaitanya Sobhita Wedding Outfit: శోభిత ధూళిపాల త్వరలో నాగచైతన్య.. వివాహం చేసుకొని అక్కినేని కోడలుగా మారబోతోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో తన పెళ్లి కోసం కావలసిన దుస్తులను ఆమె స్వయంగా ఎంచుకుంటున్నట్లు సమాచారం.
Sobhita wedding dress: అక్కినేని కుటుంబానికి కొత్త కోడలిగా వెళ్ళనున్న శోభిత ధూళిపాళ అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. గత మూడు సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్న నాగచైతన్య ,శోభిత..ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం జరుపుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ముఖ్యంగా నిశ్చితార్థం జరిగిన తర్వాత వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను హీరో నాగార్జున సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో అందరూ మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అంతేకాదు మీడియా రూమర్స్ నిజమయ్యాయి అని మీడియా అంత లేనిదే వార్తలు సృష్టించదు అంటూ చాలామంది కామెంట్ చేశారు. ఇకపోతే నిశ్చితార్థంతో సగం పెళ్లి అయిపోయినట్టే అంటారు పెద్దలు. ఇక అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగబోతోంది అని సమాచారం. ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న శోభిత , నాగచైతన్య పెళ్లికి సంబంధించిన దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే శోభిత దూళిపాళ పెళ్లి పీటలపై కట్టుకోబోయే చీరను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తున్నట్లు సమాచారం. నిజమైన బంగారు జరీ వర్క్ తో కూడిన అద్భుతమైన కంజీవరం చీరను ఆమె ఎంపిక చేసుకుందట..అంతేకాదు తన వివాహ వేడుకలలో ఒక చీర కోసం ఆంధ్ర ప్రదేశ్ లోని పొందూరు పట్టణం నుండి ప్రత్యేకంగా నేసిన సాధారణ తెల్లటి ఖాదీ చీరను కూడా ఎంచుకున్నట్లు సమాచారం.
అలాగే వరుడు హీరో నాగచైతన్య కోసం కూడా ఒక మ్యాచింగ్ సెట్ ను ఆమె కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన తల్లితో కలిసి షాపింగ్ చేస్తూ.. తన వివాహానికి సంబంధించిన ప్రతి దుస్తులను కూడా ఆమె స్వయంగా ఎంపిక చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నాగచైతన్య తో వివాహం ఆమె జీవితానికి ఒక కొత్త మలుపు ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి నిమిషం కూడా పూర్తిగా శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే శోభితా ధూళిపాల ఇలా తన దుస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Telangana Survey: ఇంటింటి సర్వేపై అదే నిర్లక్ష్యం.. 12 రోజులలో 58 శాతమే పూర్తి
Also Read: KT Rama Rao: లగచర్ల గ్రామాన్ని రేవంత్ రెడ్డి సమాధి చేస్తుండు: కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter