బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తనయ, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మెహెందీ సెరెమనీ ఘనంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ వేడుకలో సోనమ్ కపూర్‌తో పాటు ఆమెకు కాబోయే భర్త ఆనంద్ అహుజ ఇద్దరూ కలిసి పలు బాలీవుడ్ ట్యూన్స్‌కి స్టెప్పేసి అతిథులను అలరించారు. శ్రీదేవి కూతుళ్లు జాన్వి కపూర్, ఖుషీ కపూర్ ఈ వేడుకకు ముందుగా హాజరై తమ కజిన్ సోనమ్‌పై తమకు వున్న ప్రేమను చాటుకున్నారు. బోనీకపూర్ మొదటి భార్య కొడుకు, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, అన్షుల కపూర్, మోహిత్ మర్వ సైతం ఈ వేడుకలో సందడి చేశారు. సోనమ్ కపూర్ చెల్లి రియా కపూర్, సోదరుడు హర్షవర్ధన్, అనిల్ కపూర్ తమదైన స్టైల్లో డ్రెస్సింగ్‌తో ఆకట్టుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



సోనమ్ కపూర్ బాబాయ్.. సంజయ్ కపూర్ ఈ వేడుకను బాగా ఎంజాయ్ చేశాడు. ఇదే విషయమై సోనమ్ కపూర్‌ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేసిన సంజయ్ కపూర్... " 20 ఏళ్ల క్రితం నా వివాహ వేడుకలో నువ్వు డ్యాన్స్ చేశావ్. ఇప్పుడు నీ వివాహ వేడుకలో నేను డ్యాన్స్ చేస్తున్నాను " అని అందులో పేర్కొన్నాడు. 


కపూర్ ఫ్యామిలీయే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, సిద్ధాంత్ కపూర్, రాణి ముఖర్జీ, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డిజైనర్ కునాల్ రావల్, తదితరులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.