Sonu Sood Slammed For the first time for being On Footboard Of Train: మొట్ట మొదటి సారిగా సోనూసూద్ కు వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి, సోను సూద్ ఏమి చేసినా రైట్ అనే కామెంట్స్ ని మాత్రమే విన్నాము,మొదటిసారిగా సోను సూద్ మీద విమర్శలు కొంత ఆశ్చర్యానికి గురి కావాల్సిందే,  ఇంతకీ మ్యాటర్ ఏంటంటే కొన్ని వారాల క్రితం సోను సూద్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పటి వీడియో గురించి ఇప్పుడేంటి అనుకుంటున్నారా దేనికైనా ఓ టైం రావాలి అన్నట్టు ఆ వీడియోకి ఇప్పుడు టైం వచ్చింది. సోను సూద్ హవా అయి పోయిందా? మంచి చేస్తేనే గుర్తుపెట్టుకుంటారా ? అంటూ వివిధ రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్లను సోను సూద్ ఎదుర్కొంటున్నారు. తాజాగా నార్త్ రైల్వే జీఆర్పీ ముంబై, ముంబై రైల్వే కమిషనర్ సోనూసూద్ ని విమర్శించారు. మిమ్మల్ని చూసి మీ అభిమానులు తప్పుదోవ పట్టే అవకాశం ఉందంటూ చురుకులు అంటిస్తూనే  మరోపక్క  ప్రపంచవ్యాప్తంగా మీరొక రోల్ మోడల్, కరోనా సమయంలో మీరు చేసిన సేవలు చాలా మందికి స్ఫూర్తి అంటూ పొగుడుకొచ్చింది.


రీల్ లైఫ్ లో మీ స్టంట్స్ ఓకే కానీ రియల్ లైఫ్ లో కాదు అని సోనూసూద్ కు నార్త్ రైల్వే, జిఆర్పి ముంబై షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ వీడియోలో ఓ ఏముందంటే ట్రైన్  ఎంట్రీ డోర్ హ్యాండిల్స్ పట్టుకుని ఫుట్ బోర్డు పై  సోనూసూద్ కూర్చుని ఉన్నారు. ఈ ర్కమంలో .భద్రతా చర్యలను పాటించకుండా ప్రయాణం చేయడం ద్వారా సోను సూద్ అభిమానులు అలా చేసి ఎక్కడ ప్రమాదానికి గురవుతారో అని ముందస్తు జాగ్రత్తల కోసం రైల్వే శాఖ అప్రమత్తం అయింది.


అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ని అందిద్దాం అంటూ పెద్ద రిప్లై ఇస్తూ సోనూ సూద్ కు చురకలు అంటించింది. ఇక ఈ విషయం పైనే కొందరు సోనూసూద్ ని విమర్శిస్తున్నారు ...మీరలా చేయడం కరెక్ట్ కాదు , మంచి సందేశాలు ఇవ్వాల్సిన మీరు అలా చేయకూడదు అని చెప్పాల్సింది పోయి ఇలాంటి వీడియోలని పోస్ట్ చేసి యువత ని తప్పుదోవ పట్టించడమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయం పై సోనూసూద్ ఇంకా స్పందించలేదు ...స్పందిస్తే ఖచ్చితంగా సోను సూద్ ఆ వీడియోని డిలీట్ చేస్తారో లేక ఈ అంశం మీద క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.                                               Reported By: Bhavani. M- Zee Telugu News Reporter


Also Read: Kishan Reddy Comments: తెలంగాణ వాళ్ల కోసం కాదు, వేరే వాళ్ల కోసం దర్యాప్తు చేస్తుంటే వీళ్ల పేర్లు బయటకొచ్చాయి!


Also Read: Varasudu Preponed: ఒక రోజు ముందుకు వారసుడు సినిమా.. చివరి నిముషంలో దిల్ రాజు మాస్టర్ ప్లాన్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook