Adult Stars Mystery Deaths: ఫేమస్ అడల్ట్ యాక్ట్రెస్ సోఫియా లియోన్ మరణ వార్త విని ప్రపంచమంతా షాక్ కి గురయ్యింది. కేవలం 26 సంవత్సరాల వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించింది ఈ నటి. కారణాలు ఏమిటి అని ఇంకా తెలియకపోయినా ఆమె మరణ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ ఛల్ చేస్తోంది. ఆమెను సంప్రదించడానికి ఆమె ఫ్యామిలీ మెంబర్స్ మొన్న రాత్రి నుంచి ఎంతో ప్రయత్నిస్తున్నా కానీ ఆమె దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. దీంతో మార్చి 1న ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా ఆమె మరణించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె స్టెప్ ఫాదర్ మీడియాకు తెలియజేసాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమె అంత్యక్రియలు కోసం ఫండ్స్ కావాలని GoFundMeలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇక ఆమె మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాగా మియామీలో జన్మించిన లియోన్ 18 సంవత్సరాల వయస్సులో అడల్ట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.


అయితే ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరిస్తోన్న విషయం ఏమిటి అంటే ఈ మధ్య వరసగా అడల్ట్ స్టార్స్ మరణాలు మిస్టరీగా మారడం. ఈ మధ్యనే అడల్ట్ ఫిల్మ్ స్టార్ కాగ్నీ లిన్ కార్టర్ ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణం కూడా ఇంకా తెలియదు. ఇక దానికి కొద్ది రోజుల ముందే మరో అడల్ట్ స్టార్ ఎమిలీ విల్లిస్ అధిక మోతాదు డ్రగ్స్ తో కోమాలోకి వెళ్ళింది. ఇక జనవరి నెలలో స్టార్స్ జెస్సీ జేన్, ఆమె ప్రియుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. వారు కూడా డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే చనిపోయి ఉంటారని అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ మరణం వెనుక కారణం కూడా అదే అయ్యుంటుందని భావిస్తున్నారు. అధికారికంగా కారణం తెలియకపోయినా వీరందరూ కూడా డ్రగ్స్ తో ముడిపడే చనిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.


మరి వీటి వెనక కారణం అదేనా లేకపోతే ఇంకేమన్నా ఉందా తెలియాలి అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముగిసే వరకు వేచి చూడాలి.


Also Read: Ap Elections 2024: ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఎవరికెన్ని సీట్లంటే


Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?


 



 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter