రానా దగ్గుబాటి నటిస్తూ, తొలిసారి నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా c/o కంచరపాలెం. వెంకటేష్ మహా అనే ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను పరుచూరి విజయ ప్రవీణతో కలిసి సురేష్ బాబు నిర్మిస్తుండగా రానా దగ్గుబాటి సమర్పిస్తున్నాడు. రానా దగ్గుబాటి ఎంతో ఇష్టపడి చేస్తోన్న ఈ సినిమాలోంచి సొట్ట బుగ్గల సిన్నది అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.