Guess Who is She: ముద్దులొలికే ఈ చిన్నారి.. మలయాళంలో టాప్ హీరోయిన్ తెలుసా?
Guess Who is She: ఈ ఫోటోలో ఉన్న ముద్దులొలికే చిన్నారిని గుర్తుపట్టారా? ఈమె మలయాళ చిత్రానికి చెందిన ఓ స్టార్ హీరోయిన్.. అటు మలయాళ, తమిళంతో పాటు తెలుగులోనూ నటిస్తుంది. ఆమెతో పాటు తన భర్త కూడా ఇటీవలే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
Nazriya Nazim Childhood Photos: దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో నటనతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ఓ డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులనూ అలరించింది. అతి కొద్ది కాలంలోనే అందంతో పాటు అభినయంతో సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అటు తమిళ, మలయాళ సినిమాలతో పాటు తెలుగులోనూ స్ట్రైయిట్ మూవీలో నటిస్తుంది. ఆమెతో తన భర్త కూడా తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా బిజీగా గడుపుతున్నారు.
[[{"fid":"217712","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
అయితే ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో ఇప్పటికే మీకు అర్థం అయినట్లు ఉంది! అవును, మీ అంచనా నిజమే! ఆమె ఎవరో కాదు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ భార్య, స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్. ఈ ముద్దులొలికే చిన్నారి పేరు నజ్రియా నజీమ్.
[[{"fid":"217713","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
'రాజా రాణి' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నజ్రియా నజీమ్.. ఇప్పుడు తెలుగులో స్ట్రైయిట్ మూవీ చేస్తుంది. ఆమె ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలతో పాటు తెలుగులో నాని హీరోగా నటిస్తున్న 'అంటే సుందరానికి!' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించేందుకు నజ్రియా సిద్ధమైనట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
[[{"fid":"217714","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఇక నజ్రియా నజీమ్ భర్త ఫహద్ ఫాజిల్ కూడా ఇప్పుడు తెలుగులో నటిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. మొత్తానికి భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి తెలుగులో నేరుగా ఎంట్రీ ఇస్తున్నారు.
Also Read: Anchor Anasuya : నువ్వు నా మోస్ట్ హ్యాండ్‌సమ్‌వి అంటూ బాధపడ్డ యాంకర్ అనసూయ.. భావోద్వేగంతో పోస్ట్
Also Read: Pushpa Movie: అభిమానులకు బంపర్ ఆఫర్.. 'పుష్ప' సినిమాకు ఐదో షో కూడా ఉంది! ఎక్కడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook