Film Critic Kaushik LM Passes Away :సినీ పరిశ్రమ నుంచి మరో విషాదకర వార్త బయటకు వచ్చింది. సౌత్ కు చెందిన సినీ విమర్శకుడు కౌశిక్ ఎల్ఎమ్ సోమవారం గుండెపోటుతో మరణించారు. కౌశిక్ ఒక ఫేమస్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకర్, ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబ్ వీడియో జాకీ అలాగే సినిమాలకు క్రిటిక్ గా తన రివ్యూలు కూడా ఇస్తూ ఉంటారు. కేవలం 35 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన మృతి పట్ల సౌత్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. కౌశిక్ మృతిపై ప్రముఖ నటి కీర్తి సురేష్ ట్వీట్ చేస్తూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ‘’ఈ వార్త విన్న తర్వాత నాకు మాటలు రావడం లేదు. ఇది నమ్మశక్యం కాదు!! అతని కుటుంబం మరియు స్నేహితులలకు నేను ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా, నువ్వు ఇక లేవంటే నమ్మలేకపోతున్నా కౌశిక్’’ అని పేర్కొన్నారు.


అదే సమయంలో, సినీ దర్శకుడు వెంకట్ ప్రభు కూడా కౌశిక్ ఎల్‌ఎమ్‌కి నివాళులర్పిస్తూ, 'ఓ మైగాడ్ నమ్మలేకపోతున్నా! కొన్ని రోజుల క్రితం కూడా అతనితో మాట్లాడాను! జీవితం నిజంగా అనూహ్యమైనది!, కౌశిక్ కుటుంబానికి మరియు స్నేహితులకు ప్రగాఢ సానుభూతి! చాలా త్వరగా వెళ్లిపోయావు మిత్రమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వీరితో పాటుగా నటి రితికా సింగ్ కూడా నివాళులర్పించారు. ఆమె ఇలా రాసింది, 'నేను బరువెక్కిన హృదయంతో ఈ ట్వీట్ చేస్తున్నా, ఇంటర్వ్యూల కోసం కౌశిక్ ను చాలాసార్లు కలిశాను, అతను చాలా మంచివాడు, ఎప్పుడూ చాలా మంచిగా మాట్లాడేవాడు, తను నన్ను కొత్త ఆర్టిస్ట్‌గా చాలా స్వాగతించాడు. అంటూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.  


అతుల్య రవి కూడా ట్వీట్ చేస్తూ, కౌశిక్ ఆకస్మిక మరణ వార్త విని చాలా బాధ, మరియు దిగ్భ్రాంతికి గురయ్యాను, చాలా చిన్న వయసులో ఆయన మరణించడం బాధాకరం. ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండే వ్యక్తి! కౌశిక్, దేవుడు అతని కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ఈ బాధను భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. నీ గుర్తించి ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నాను, నిన్ను మిస్ అవుతున్నాను అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. 


Also Read: Bandla Ganesh: పవన్ కళ్యాణ్ సినిమా లేనట్టే.. వింత ట్వీట్ తో కొత్త అనుమానాలు రేపిన బండ్ల!


Also Read: Prashanth Neel: సొంతూరి కోసం ప్రశాంత్ నీల్ మనసున్న పని.. ఒక్కసారిగా 50 లక్షలు విరాళం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి