Sravanthi Chokkarapu Sizzling Photoshoot: ఒకప్పుడు తెలుగు యాంకర్లు అంటే పూర్తిస్థాయిలో వస్త్రధారణతో కనిపించేవారు. కానీ రాను రాను హాట్ యాంకర్ల హవా పెరిగిపోతోంది. యాంకరింగ్ చేసే సమయంలో ఎలా ఉన్నా మిగతా సమయంలో హాట్ యాంకర్ అని పేరు తెచ్చుకోవడానికి మన తెలుగు యాంకర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఇలాంటి యాంకర్ల లిస్టులో ముందు వరుసలో అనసూయ భరద్వాజ్,  శ్రీముఖి,  విష్ణు ప్రియ,  మంజూష,  అరియానా వంటి వారు కనిపిస్తారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు మరో యాంకర్ కూడా హాట్ బాంబ్ అని పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. 
 
ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న స్రవంతి చొక్కారపు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్ తెచ్చుకొని కెరీర్లో దూసుకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తోంది. బిగ్ బాస్ కంటే ముందే పలుసార్లు హాట్ ఫోటోషూట్లు చేసి వార్తల్లోకి ఎక్కిన ఈ భామ బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత ఇక తనకు హద్దులే లేవన్నట్లు రెచ్చిపోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీచ్ లో కేవలం లో దుస్తులు అఆమే ధరించి షేర్ చేసిన ఒక ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మాములుగా ఇలా హాట్ ఫోటోలు పెట్టడం కామనే కానీ స్రవంతి తొలిసారిగా ఇలా అందాలు రెచ్చిపోయి అరబోయడంతో ఇప్పుడు ఆమె హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే ఆమె జబర్దస్త్ యాంకర్ సీటు మీద కన్నేసిందనే ప్రచారం జరుగుతోంది. దానికి కారణం అనసూయ భరద్వాజ్. ఆమె జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ సీటు ఎవరితో భర్తీ చేస్తారనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మంజూష ఈ స్థానంలో ఎంట్రీ ఇవ్వొచ్చనే ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో స్రవంతి కూడా తానేమి తక్కువ తినలేదు అంటూ అందాలు ఆరబోయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. 


ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్రవంతి ఇప్పటికే ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో తన భర్త గురించి కుమారుడి గురించి అనేకసార్లు ఆమె చెబుతూ ఉండేది. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయ ఆ మాత్రం అందాల ఆరబోస్తూ హాట్ టాపిక్ గా మారితే నాకేం తక్కువ అనుకుందో ఏమో కానీ ఈ మధ్యకాలంలో ఆమె అందాల ఆరబోత డోసు పెంచినట్లు అర్థమవుతుంది. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్ లో అయితే మరీ దారుణంగా కేవలం లోదుస్తుల మీదే కనిపిస్తోంది. ఒకపక్క తొడల అందాలు చూపిస్తూ మరోపక్క జుట్టు విరబోసుకొని తన వీపు అందాలను కూడా చూపిస్తూ స్రవంతి టీజ్ చేస్తోంది. అంతేకాక ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ కు ఆసక్తికరమైన కామెంట్లు కూడా పెట్టిందండోయ్. 




స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook