Samajavaragamana OTT: ఓటీటీలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న `సామజవరగమన`.. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
Samajavaragamana OTT: శ్రీవిష్ణు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన `సామజవరగమన` ఓటీటీలో సంచనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా దెబ్బకు స్ట్రీమింగ్ రికార్డ్సున్నీ బద్దలవుతున్నాయి. ఈ మూవీని ఓటీటీలో చూడొచ్చంటే..
Samajavaragamana OTT: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ఇటీవల 'సామజవరగమన'(Samajavaragamana) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.50 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. సరైన హిట్ లేక సతమవుతున్న శ్రీవిష్ణు కెరీర్ కు ఇది మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా చూసి చాలా ఏళ్ల తర్వాత మూవీ లవర్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు. జూన్ 23న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మెుదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలు కూడా ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు.
కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రెబ్బా మౌనికా జాన్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటుడు నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్, ప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి గోపీ సుందర్ సంగీతం అందించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also read: Ambati Rambabu Movie on Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై అంబటి రాంబాబు తీసే సినిమా పేరేంటో తెలుసా
ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 27న ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ తొలి 40 గంటల్లోనే ఏకంగా 100 మిలయన్స్ కు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌ను నమోదు చేసి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా తాజా మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఓటీటీలోకి వచ్చిన మెుదటి 72 గంటల్లోనే 20 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆహా ఓటీటీలో ఇంత ఫాస్ట్‌గా 20 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను అందుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆహా.. నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత అనే క్యాప్షన్‌ను జోడించి ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
Also Read: Oh My God-2 Movie: దేవుడి సినిమాకు ‘A’ సర్టిఫికేట్.. షాక్ లో బాలీవుడ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook