Kalyaan Dhev Daughter Navishka Birthday కళ్యాణ్‌ దేవ్ తన కూతురు నవిష్క బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకోలేకపోతోన్నాడని బాధపడుతూ ఉన్నాడు. మరో వైపు శ్రీజ తన కూతురి బర్త్ డేను సెలెబ్రేట్ చేసింది. నవిష్కను మిస్ అవుతున్నాను.. చూసి చాలా కాలమే అయిందంటూ కళ్యాణ్‌ దేవ్ బాధపడుతున్న పోస్ట్‌ను చూసి నెటిజన్లు కరిగిపోయారు. అయితే శ్రీజ మాత్రం తన కూతురి బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసి ఆ వీడియోను ఇలా షేర్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కళ్యాణ్ దేవ్, శ్రీజ కొణిదెల విడాకుల రూమర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైతే శ్రీజ కళ్యాణ్‌గా ఉన్న తన ఇన్ స్టా హ్యాండిల్ పేరుని శ్రీజ కొణిదెలగా మార్చిందో.. అప్పుడే విడాకుల రూమర్లు ఎక్కువయ్యాయి. అయితే ఇంత వరకు ఈ విడాకుల మీద అధికారికంగా స్పందించలేదు. వాటిని ఖండించలేదు. 


ఈ విడాకుల రూమర్లు ఇలా నవిష్క బర్త్ డే సందర్భంగా మరో తెర మీదకు వచ్చాయి. ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని, నవిష్క అయితే శ్రీజ వద్దే ఉంటోందని తెలుస్తోంది. కళ్యాణ్ దేవ్ తన కూతురిని కూడా చూసుకోలేకపోతోన్నాడని తెలుస్తోంది. దీంతో అందరూ కళ్యాణ్‌ దేవ్ గురించి బాధపడుతున్నారు.


 



మీరు ఆ పాప కోసమైనా కలిసి ఉండాల్సింది.. మీ ఇద్దరూ ఎందుకు విడిపోయారు.. అసలేం జరిగింది? అంటూ ఇలా నానా రకాలుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. నువ్వే నా ప్రపంచం.. నువ్వే నా నవ్వుకి కారణం అంటూ నవిష్క మీద కళ్యాణ్‌ దేవ్ వేసిన పోస్ట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.


ఇక ఇప్పుడు కళ్యాణ్‌ దేవ్ పోస్ట్ అలా ఉంటే.. శ్రీజ తన కూతురి బర్త్ డేను సెలెబ్రేట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ చర్యలతో తమ మధ్య బంధం అంటూ లేదని, అది ముగిసిపోయిందంటూ చెప్పకనే చెప్పేస్తున్నారు.


Also Read : Pawan Kalyan Unstoppable : పేరు తెలీదు అన్నోడే పడిగాపులు కాసేలా.. పవన్ బాలయ్య మీటింగ్‌పై మంట పెట్టిన మెగా ఫ్యాన్ ట్వీట్


Also Read : Sudigali Sudheer Love : ఊపిరి ఉన్నంత వరకు ఆమెనే ప్రేమిస్తుంటా.. అసలు విషయం చెబుతూ ఫోటోను చూపించిన సుడిగాలి సుధీర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook