Sreeja Konidela And Sushmita on Upasana Pregnancy మెగా అభిమానులు అంతా కూడా గత దశాబ్దకాలం నుంచి చూస్తున్న ఎదురుచూపులకు ఫలితం దక్కింది. రామ్ చరణ్‌కు వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడా? ఉపాసన ఎప్పుడు గర్భం దాల్చుతుందా? అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూడసాగారు. ఉపాసన మాతృత్వం మీద ఎన్నెన్నో రకాల రూమర్లు వచ్చాయి. అయితే చివరకు అభిమానుల ఆశలు ఫలించాయి. రామ్ చరణ్‌ తండ్రి కాబోతోన్నాడని, ఉపాసన గర్భం దాల్చిందంటూ.. చిరంజీవి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఆంజనేయుడి ఆశీస్సులతో తమ ఇంటికి వారసుడు రాబోతోన్నాడంటూ చిరంజీవి చేసిన ఈ పోస్ట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. మొత్తానికి రామ్ చరణ్‌ త్వరలోనే తండ్రి కాబోతోన్నాడనే వార్త మాత్రం ఇండస్ట్రీలో అందరికీ ఆనందాన్ని కలగజేసింది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన నెలలోనే రామ్ చరణ్‌ కొడుకు కూడా పుట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.


ఇదంతా ఇలా ఉంటే.. మెగా ఇంట్లో సంబరాలు అంబరాన్నంటేశాయి. రామ్ చరణ్‌ సిస్టర్స్ సుష్మిత, శ్రీజలు ఈ వార్తల మీద స్పందించారు. అత్తగా మారేందుకు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నా.. మరి నువ్‌ అని శ్రీజను ట్యాగ్ చేసింది సుష్మిత. నేను కూడా రెడీగానే ఉన్నానంటూ చిందులు వేస్తున్న పోస్ట్‌ను చేసింది శ్రీజ. మొత్తానికి రామ్ చరణ్ తండ్రి కాబోతోన్నాడనే వార్త మాత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.


[[{"fid":"255662","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సెలెబ్రిటీల వరకు అంతా కూడా ఈ వార్త మీద స్పందిస్తున్నారు. రామ్ చరణ్‌, ఉపాసన జోడికి కంగ్రాట్స్ చెబుతున్నారు. మెగా వారసుడు ఆన్ ది వే అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఆ తరువాత బుచ్చిబాబుతో సినిమాను చేసేందుకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ మధ్యే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగపోయింది.


Also Read : Regina Cassandra Birthday : రెజీనా బర్త్ డే.. రొమాంటిక్ పిక్‌తో లవ్యూ చెప్పిన సందీప్ కిషన్.. నెటిజన్ల సెటైర్లు వైరల్


Also Read : Shriya Saran photoshoot : జాకెట్ విప్పేసిన శ్రియా.. షాట్స్ బాగా నచ్చాయన్న హీరోయిన్.. పిక్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook