Sreeleela I love You Idiot Movie టాలీవుడ్‌లో ప్రస్తుతం హ్యాపెనింగ్‌ హీరోయిన్ అంటే శ్రీలీల పేరు వినిపిస్తుంది. శ్రీలీల డేట్స్ దొరకడం కూడా కష్టంగానే మారిపోయింది. స్టార్ హీరోలంతా కూడా శ్రీలీల పేరు జపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్‌ సినిమాల్లో శ్రీలీల నటించేస్తోంది. ఇలా స్టార్ హీరోల సినిమాల్లో శ్రీలీల ఫస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. బడా సంస్థలు కూడా శ్రీలీలను తీసుకోవాలని ప్రయత్నిస్తోన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  Ravanasura Movie Review : రావణాసుర రివ్యూ.. లాజిక్స్ వెతికితే కష్టమేరా


అసలే శ్రీలీల నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారుతున్నాయి. పెళ్లి సందడి, ధమాకా సినిమాలు కమర్షియల్‌గా బాగానే వర్కవుట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ధమాకా అయితే ఏకంగా వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అవ్వడంతో శ్రీలీల రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆమె పాత సినిమాల మీద జనాలు ఫోకస్ పెట్టారు.


 



ఆమె కన్నడలో మొదటగా నటించిన కిస్ సినిమా ఇక్కడ ఐ లవ్ యూ ఇడియట్ అంటూ విడుదలైంది. ఎపి అర్జున్‌ దర్శకత్వంలో అవిరుద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద ఈ సినిమాను నిర్మించారు.  శ్రీమతి బత్తుల వసంత సమర్పణలో  సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల, ఎపి అర్జున్‌ నిర్మాతలుగా ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఆ సినిమా ఇప్పుడు భవాని సంస్థ ద్వారా ఆహాలోకి వచ్చేసింది.


ఐ లవ్ యూ ఇడియట్ సినిమా.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా మల్చడం, సినిమాలో శ్రీలీల అందాలు, డ్యాన్సులు సినిమాను నిలబెట్టేశాయి. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో అందరినీ ఆకట్టుకుంటోంది. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. శ్రీలీల ప్రస్తుతం బాలయ్య బాబు, మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్‌ వంటి వారి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె డైరీ వచ్చే ఏడాది వరకు ఖాళీగా లేదని తెలుస్తోంది.


Also Read: Ravanasura Twitter Review: రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ ఇలాంటివి చేయకు అన్న!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook