Vijay Deverakonda-Sreeleela: టాలీవుడ్ సన్సెషన్ శ్రీలీల చేతి నిండా సినిమాలతో పుల్ బిజీగా ఉంది. ఈ అమ్మడు కాల్షిట్ లన్నీ ఎప్పుడో నిండిపోయాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తూ యమ జోరు మీదుంది ఈ బ్యూటీ. నటనతో పాటు  డ్యాన్స్ లు కూడా అదరగొట్టడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేశ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల చిత్రాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విషయాన్ని శ్రీలీల బాగా అర్థం చేసుకుంది. అందుకే కెరీర్ జోరుమీదున్నప్పుడు వరుస సినిమాలకు ఓకే చెప్పింది. దీంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక పలు ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. తాజాగా విజయ్‌ దేవరకొండ-గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ నుంచి తప్పుకుననట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 


రామ్, శ్రీలీల జంటగా నటించిన స్కంద సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. మరోవైపు ఈ బ్యూటీ బాలకృష్ణతో భగవంత్‌ కేసరి, మహేశ్ బాబుతో గుంటూరు కారం, పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ తో ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌, మెగా హీరో వైష్ణవ్ తో ఆది కేశవ సినిమాలు చేస్తుంది. దీంతోపాటు మరో రెండు కన్నడ సినిమాలు కూడా చేస్తుంది. 


పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. శ్రీకాంత్ తనయుడు హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్సడ్ టాక్ తెచ్చుకుంది.  ఆ తర్వాత రవితేజతో నటించిన ధమాకా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. కొన్ని సీన్స్ లో మాస్ మహారాజానే డామినేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆ అమ్మడుకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. 


Also Read: KG George: మాలీవుడ్ లో విషాదం.. లెజండరీ డైరెక్టర్ క‌న్నుమూత‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook