Sreeleela with Devara Actor: శ్రీకాంత్ కొడుకు హీరోగా చేసిన.. పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల. ఆ తరువాత రవితేజతో చేసిన ధమాకా చిత్రం… ఆమెను సెన్సేషన్ హీరోయిన్ గా మార్చేసింది. ధమాకా చిత్రం తర్వాత నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.. ఈ హీరోయిన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకేసారి ఏకంగా తొమ్మిది సినిమాలు సైన్ చేసి.. సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ తొమ్మిది సినిమాలలో భగవంత్ కేసరి సినిమా మినహా.. ఏ సినిమా కూడా.. ఆమెకు నటిగా పేరు తీసుకురాలేదు. ముఖ్యంగా వైష్ణవ తేజతో తీసిన ఆది కేశవ చిత్రం.. శ్రీలీల కెరియర్ పైన తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఈ మధ్యనే మహేష్ బాబు గుంటూరు కారం.. సినిమాలో కూడా కనిపించిన.. ప్రస్తుతం మాత్రం శ్రీలీలకి తెలుగులో..ముందులాగా వరస సినిమా చాన్సులు చేతిలో లేవు.


తెలుగు ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ చిత్రం ఒకటే అఫీషియల్ గా ఉంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ సినిమా..ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి ఇంకా టైం పట్టేలా ఉంది. కాగా తెలుగులో శ్రీలీల కి అవకాశాలు రాక కాదని.. కేవలం మందులాగా తొందరపడకుండా.. ప్రస్తుతం సినిమాలను ఆచితూచి తీసుకుంటుందని తెలుస్తోంది.


ఈ క్రమంలో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. సీనియర్ హీరో, దేవరతో తెలుగులో విలన్ గా పరిచయం కాబోతున్న సైఫ్ అలీ ఖాన్.. కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ సినిమాకి.. తననే ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


ఈ సినిమా జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో రూపొందుతుందని సమాచారం. ఇక ఈ సంవత్సరం ఆగస్ట్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నారట. కొద్దిరోజుల్లోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన కూడా బయటకి  వచ్చే అవకాశముంది. 


ఇక ఇబ్రహీం తండ్రి సైఫ్ అలీ ఖాన్ విడాకులు తీసుకున్న మొదటి భార్య.. కొడుకు. ఇక ఈ హీరో రెండో భార్య కరీనా కపూర్. వీరి సంగతి పక్కన పెడితే మొత్తానికి మన శ్రీలీల మాత్రం.. తెలుగు సినిమాలో శ్రీకాంత్ కొడుకు తో ఎంట్రీ ఇచ్చినట్టు.. హిందీలో కూడా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో ఎంట్రీ ఇవ్వనుంది.
మరి అక్కడ కూడా తెలుగు సినిమాల లాగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో లేదో వేచి చూడాలి.


Also Read:ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై వైద్యం?


Also Read:ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం.. రామోజీరావుపై మెగాస్టార్ ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter