Sri Reddy on Bigg Boss: నేను ఛస్తే వెళ్లను.. నాగార్జున రంగేసుకుని ఎలా చేస్తున్నారు.. బిగ్ బాస్ పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్
Sri Reddy Strong Comments on Bigg Boss Show: వివాదాస్పద నటి శ్రీరెడ్డితో జీ తెలుగు న్యూస్ ఆమెతో ఒక స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి బిగ్ బాస్ పై హాట్ కామెంట్స్ చేశారు.
Sri Reddy Strong Comments on Bigg Boss Show: వివాదాస్పద నటి శ్రీరెడ్డి తెలుగులో చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయింది. ఆ మధ్యకాలంలో ఫిలింనగర్ లో అర్ధనగ్న ప్రదర్శన చేసి హాట్ టాపిక్ గా మారిన ఈ భామ తర్వాత తన మకాం చెన్నై మార్చేసింది. ప్రస్తుతానికి యూట్యూబ్ లో హాట్ హాట్ గా వంటల వీడియోలు చేస్తూ గడిపేస్తున్న ఆమె ఈ మధ్యకాలంలో మళ్లీ హైదరాబాద్ లో దర్శనం ఇచ్చింది.
ఈ సందర్భంగా జీ తెలుగు న్యూస్ ఆమెతో ఒక స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె అనేక విషయాలను జీ తెలుగు న్యూస్ తో పంచుకున్నారు. ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారిన బిగ్ బాస్ వ్యవహారం మీద కూడా ఆమె హాట్ హాట్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళతారా అని అడిగిన ప్రశ్నకు ఆమె చస్తే బిగ్ బాస్ కు వెళ్ళనంటూ సమాధానం చెప్పారు. బిగ్ బాస్ కి వెళ్లి ఉన్న పరువు తీసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పుకొచ్చారు.
తాత్కాలికంగా నాలుగు రాళ్లు వెనకేసుకుని ఇల్లు కొనుక్కోగలరేమో కానీ ఉన్న పరువు క్యారెక్టర్ పోగొట్టుకొని బయట నిలబడిన వారు ఎంతోమంది ఉన్నారని ఒకవేళ తనకు అవకాశం వచ్చినా తానుహౌస్ లోపలికి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. అంతేకాదు బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాప్ షో అని, నాగార్జున అసలు ఎలా ఒప్పుకుని ఆ షో చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. నాగార్జున మీసాలకి, జుట్టుకు రంగు వేసుకుని నాలుగు పూల చొక్కాలు వేసుకొని బిగ్ బాస్ టీమ్ వాళ్ళు రాసిచ్చిన ప్రశ్నలు అడిగితే సరిపోతుందా అంటూ ఆమె ప్రశ్నించారు.
ఇక నాగార్జున హోస్టింగ్ విషయంలో సిపిఐ నారాయణ కూడా పలు సందర్భాలలో తప్పు పట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బిగ్ బాస్ షో టైమింగ్స్ మార్చాలంటూ తెలుగు శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయగా దాన్ని హైకోర్టు విచారణకు అంగీకరించింది.
అసభ్యకర సన్నివేశాలు ఉన్న ఈ బిగ్ బాస్ షోను ఫ్యామిలీ టైంలో ప్రసారం చేస్తున్నారని దాన్ని అర్థరాత్రి సమయంలో ప్రసారం చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా సిపిఐ నారాయణ ఈ షో ఒక బ్రోతల్ హౌస్ షో అంటూ కూడా కొన్ని ఘాటు కామెంట్లు చేశారు. అయితే ఈ విషయం మీద నాగార్జున షో వేదికగా కౌంటర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇంత జరుగుతున్నా బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతోంది.
Also Read: Mahesh Babu Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్-1లో.. మహేష్ బాబు రిజెక్ట్ చేసిన పాత్ర ఇదే!
Also Read: Deepika-Ranveer Divorce: దీపికా-రణ్‌వీర్‌లు విడిపోతున్నారా.. అసలు కారణం అదేనా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.