Sri tej Health Bulletin: హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ గానే పరిగణించింది. ఈ ఘటనలో చిత్ర యూనిట్, సంధ్య థియేటర్ యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వాల తప్పిదాలు ఉన్నాయి. దీంతో ఈ ఘటనలో అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు A 11గా చేర్చింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం.. వెంటనే బెయిల్ రావడం..ఒక రాత్రి జైల్లో గడపడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ తీరును తప్పు పట్టింది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈ ఘటనపై ఆచితూచి స్పందించారు. ఇందులో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిందన్నారు. ఏపీలో జగన్ సర్కారులా కాకుండా.. ప్రీమియర్ షోలతో పాటు వారం రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేసారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోంది. తాజాగా కిమ్స్‌ వైద్యులు శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గత రెండు రోజుల నుంచి శ్రీతేజ్‌కి మళ్లీ ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుందని డాక్టర్లు తెలిపారు. అతనికి ఆదివారం నుంచి ప్రసరణను కొనసాగించడానికి తక్కువ మోతాదు ఐనోట్రోపిక్ సపోర్ట్ కూడా అవసరమైందని చెప్పారు.


PCR నివేదిక ప్రకారం, అతని యాంటీ బయాటిక్స్ శనివారం నుంచి మార్చామని, అతనికి ఎటువంటి జ్వరం లేదని, అతని నాడీ సంబంధిత స్థితి యథాతథంగా ఉందని చెప్పారు. పైప్‌ ద్వారానే శ్రీతేజ్‌కు ఆహారం అందిస్తున్నామన్నారు.  ఎడమ వైపు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ తగ్గిందని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్లో తెలిపారు. మరోవైపు పుష్ప 2 సినిమా 26 రోజులైన ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే హిందీలో రూ. 780 కోట్ల నెట్ వసూల్లతో సంచలనం రేపుతోంది. మరోవైపు తెలుగు లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.