Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్ పై బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. భార్య పై ప్రేమ ఉంటే మరి ఇలానా..
Sridevi Biopic: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎంతో మంది సినీ నటులు జీవితాలు వెండితెరపై ఆవిష్కరించబడ్డాయి. త్వరలో శ్రీదేవి బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నట్టు సినీ ఇండస్ట్రలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై శ్రీదేవి భర్త బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sridevi Biopic: అతిలోకసుందరి అనే పదం శ్రీదేవి గురించి పుట్టిందేమో. తన యాక్టింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. దాన్ని అక్షరాల ఫాలో అయింది శ్రీదేవి. తెలుగు సహా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి.. ఆపై బాలీవుడ్‌లో కూడా నంబర్ వన్ హీరోయిన్‌గా అప్పట్లోనే సత్తా చాటింది. ఇక ఈమె సినిమాలే కాదు.. ప్రేమ, పెళ్లి విషయాల్లో సినిమాలకు మించిన ట్విస్టులున్నాయి. ఇక ఈమె సినిమా జీవితమే కాదు.. మరణంలో పెద్ద మిస్టరీ ఉంది. ఓ సినిమాకు కావాల్సినంత మసాలా ఉంది. అందుకే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ శ్రీదేవి జీవితాన్ని వెండితెరపై చూపించాలని తాపత్రయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్ తను నిర్మించిన 'మైదాన్' మూవీ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. నేను బతికి ఉన్నంత వరకు ఆమె బయోపిక్ తెరకెక్కించడానికి ఒప్పుకోను గాక ఒప్పుకోను అంటూ కుండ బద్దలు కొట్ఆరు.
నా భార్య శ్రీదేవి ప్రైవేట్ పర్సన్. తన పర్సనల్ విషయాలు బయటకు చెప్పడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. లైఫ్ లాంగ్ అదే మెయింటెన్ చేసింది. ఇపుడా వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పడానికి నేను అంగీకరించను. నేను బతికున్నంత కాలం శ్రీదేవి బయోపిక్‌కు పర్మిషన్ ఇవ్వను గాక ఇవ్వను. ఇక శ్రీదేవి రీ ఎంట్రీ మూవీ 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమా గురించి మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రాన్ని నేను ఐశ్వర్యరాయ్ బచ్చన్‌తో తెరకెక్కించాలనున్నాను.. మాజీ మిస్ వరల్డ్ అయిన ఐశ్వర్య ఆ పాత్రలో నటిస్తే సెట్ కాదని చెప్పాను. ఆ క్యారెక్టర్‌కు శ్రీదేవి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పాను. ఆ సినిమాలో శ్రీదేవి ఇంగ్లీష్ రాని పాత్రలో యాక్ట్ చేస్తే ప్రేక్షకులు నీరాజనాలు పలికిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
రీదేవి నటించిన ‘‘ఇంగ్లిష్ వింగ్లిష్’’(English Vinglish) చిత్రాన్ని మొదట ఐశ్వర్యారాయ్‌తో తీయాలనుకున్నారు. ఐశ్వర్య ఒకప్పటి మిస్ వరల్డ్.. ఆమె ఇంగ్లిషు రాని పాత్రలో నటిస్తే ప్రేక్షకులకు నచ్చదని చెప్పాను. ఆ పాత్రకు శ్రీదేవి కచ్చితంగా సరిపోతుందని చెప్పడంతో దర్శకనిర్మాతలు అంగీకరించారు. ఆ చిత్రంలో ఇంగ్లిషు రాని గృహిణి పాత్రలో శ్రీదేవి జీవించింది. ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. నా భార్య చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడానికి ఇష్టపడేది కాదు. జీవితమంతా అలానే ఉంది. ఇప్పుడు ఆ పర్సనల్ విషయాలు బయటకు చెప్పడానికి నేను అంగీకరించను. నేను బతికి ఉన్నంతవరకు బయోపిక్‌కు అనుమతివ్వను’ అని బోనీ కపూర్ స్పష్టం చేశారు.
శ్రీదేవి విషయానికొస్తే.. బాల నటిగా కెరీర్ మొదలు పెట్టి ఏ హీరోలకు కూతురుగా.. మనవరాలిగా నటించిందో వాళ్ల సరసన కథానాయికగా యాక్ట చేసి మెప్పించింది. అంతేకాదు అప్పట్లో అన్ని భాషల్లో ఏక కాలంలో నంబర్ వన్ కథానాయికగా సత్త ఆచాటింది. ఆమె నటనకు ఎన్నో అవార్డులు.. రివార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఈమె జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రముఖ రచయత ధీరజ్.. శ్రీదేవి బయోపిక్‌ను రచించనున్నారు. 'ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్' (The Life of A Legend) పేరుతో ఇది రానుంది. ఈ పుస్తకం కోసం శ్రీదేవి కుటుంబ సభ్యుల పర్మిషన్ తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read: YS Jagan: మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. వలంటీర్ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తా: వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook