Srikanth Son: ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీకాంత్ ఈమధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా తన సత్తా చాటుతూనే ఉన్నారు. శ్రీకాంత్ తనయుడిగా రోషన్ మేక సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై మూడేళ్లు అయింది. నిర్మలా కాన్వెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటుడు 2021 లో పెళ్లి సందడి అనే సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినాప్పటికీ మంచి రివ్యూస్ ని అందుకుంది. ఆ సినిమా తర్వాత శ్రీలీల పెద్ద హీరోయిన్ గా మారిపోయింది కానీ రోషన్ కి మాత్రం పెద్దగా ఆఫర్లు రాలేదు. 


ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో రోషన్ హీరోగా ఛాంపియన్ అనే సినిమా గురించిన అధికారిక ప్రకటన విడుదల అయ్యి నెలలు గడుస్తోంది. ఇది ఒక భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనుంది. కానీ గత కొంతకాలంగా ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు. 


మరోవైపు మోహన్ లాల్ మలయాళం లో తీస్తున్న ప్యాన్ ఇండియా సినిమా వృషభ లో రోషన్ కి కీలక పాత్ర దొరికింది కానీ ఆ సినిమా విడుదల అవడానికి ఇంకా చాలా సమయం ఉంది. హ్యాండ్ సమ్ గా ఉండే రోషన్ కి టాలెంట్ కూడా ఉంది కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం అతనికి పెద్ద అడ్డంకిగా మారింది అని అభిమానులు చెబుతున్నారు. 


సినిమా ఎంపిక విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందో అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ చూస్తే తెలుస్తుంది. ప్రతి ఏడాది బోలెడు సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. త్వరగా సినిమాలు చేస్తూ పోకపోతే ప్రేక్షకులు మర్చిపోయే అవకాశం కూడా ఉంది. 


ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శ్రీకాంత్ వరుసగా సినిమాలు చేస్తున్నారు కానీ రోషన్ మాత్రం హీరోగా కనీసం రెండు సినిమాలు కూడా చేతిలో పెట్టుకోలేకపోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు తో కూడా రోషన్ తో ఒక సినిమా సైన్ చేసినట్లు వార్తలు వినిపించాయి కానీ దానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు రాలేదు. 


ప్రస్తుతం చాంపియన్ సినిమా మీదే రోషన్ తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. కనీసం ఆ సినిమా అయినా త్వరగా విడుదల అయితే మళ్లీ ప్రేక్షకుల దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా శ్రీకాంత్ కొడుకుగానే ఉన్న రోషన్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలడో లేదో చూడాలి.


Also Read: Wine Shops: మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌


Also Read: KCR: నోరు విప్పిన కేసీఆర్‌.. కవిత, అరవింద్‌, హేమంత్‌ అరెస్ట్‌పై తొలి స్పందన ఇదే..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook