800 Movie: కరోనా మహమ్మారి కాలం నుంచి ఓటీటీలకు క్రేజ్ విపరీతంగా పెరిగింది. కావల్సిన భాషలో అన్ని రకాల కంటెంట్ కలిగిన సినిమాలు లేదా వెబ్‌సిరీస్‌లు అందుబాటులో ఉండటంతో ఓటీటీ స్ట్రీమింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే కొన్ని సినిమాలు థియేటర్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యకాలంలో ఓటీటీల్లో చడీచప్పుడు లేకుండా సినిమాలు విడుదలవుతున్నాయి. అలాంటిదే మరో సినిమా సడెన్ ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 800 వికెట్లు తీసిని ఏకైక క్రికెటర్, శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ సినిమా పేరు 800. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎంఎస్ శ్రీపతి తెరకెక్కించిన ఈ సినిమాకు బుకర్ ప్రైజ్ విన్నర్ షెహన్ కరుణతిలక స్క్రిప్ట్ అందించారు. ఈ బయోపిక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా అక్టోబర్ 6న ధియేటర్లలో విడుదలైంది. అటు శ్రీలంక సింహళ భాషలో సైతం విడుదలైంది. కమర్షియల్ గా సినిమా హిట్ కాలేకపోయింది. అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. 


ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని జియో సినిమా దక్కించుకుంది. డిసెంబర్ 2 నుంచి అంటే ఇవాళ్టి నుంచి జియో సినిమాలో 800 సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా అన్ని భాషల్లో అందుబాటులో ఉండనుంది. వాణిజ్యపరంగా హిట్ కాకపోయినా విమర్శకులు సైతం మెచ్చుకున్న సినిమా ఇది. జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుండటంతో పెద్దఎత్తున చూసే అవకాశముందని అంచనా. 


ముత్తయ్య మురళీధరన్ పాత్రలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించగా మురళీధరన్ భార్య పాత్రలో మహిమా నంబియాన్ నటించింది. అఖండ, స్కంద సినిమాల పేమ్ శరత్ లోహితన్య ఈ సినిమాలో కీలకభూమికలో కన్పించాడు. 


Also read: OTT Release: సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప విలన్ సినిమా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook