లై, ఛల్‌ మోహన్‌రంగ సినిమాలతో డీలా పడిన నితిన్ మళ్లీ తన మునుపటి ఫామ్‌ని సొంతం చేసుకోవాలనే కసితో చేసిన సినిమా ఈ 'శ్రీనివాస కళ్యాణం'. నితిన్ కెరీర్‌కి ఊపిరిపోసిన దిల్ సినిమాను నిర్మించిన దిల్ రాజు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నితిన్‌‌‌తో చేస్తోన్న మొదటి సినిమా కూడా ఇదే. 'శతమానం భవతి' ఫేమ్‌ సతీష్‌ వేగేశ్న డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నితిన్‌, రాశిఖన్నా జంటగా నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, రాజేంద్ర ప్రసాద్‌, సీనియర్‌ నరేష్‌ లాంటి స్టార్స్ ఎందరో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ని తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా పాటలు ఇప్పటికే సందడి చేస్తుండగా తాజాగా ఇవాళ విడుదలైన ట్రైలర్ సైతం ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం... మీరు కూడా శ్రీనివాస కళ్యాణం ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


శతమానంభవతి సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న సతీశ్ వేగేశ్న ఈ సినిమాతోనూ తన మార్క్ చూపించుకున్నారని ఈ ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. సినిమాపై అంచనాలను పెంచిన ఈ ట్రైలర్‌కి తగినట్టుగా శ్రీనివాస కళ్యాణం ఉంటుందో లేదో తెలియాలంటే ఆగస్టు 9న సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే మరి.