Rajamouli mahabharatam: సినీ ప్రేక్షకులకు మాంచి కిక్క్ ఇచ్చే శుభవార్త. 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) లో తెరను పంచుకున్న రామ్​చరణ్-ఎన్టీఆర్...మరో క్రేజీ ప్రాజెక్టులోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్​లో భాగంగా స్వయంగా రాజమౌళినే (SS Rajamouli) ఈ విషయాన్ని ధృవీకరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజమౌళి డ్రీమ్​ప్రాజెక్ట్​ 'మహాభారతం' (SS Rajamouli Dream Project Mahabharatam ) అని అందరికీ తెలిసిన విషయమే. అయితే 'మీ డ్రీమ్ ప్రాజెక్టులో మేమిద్దరం ఉంటామా?' అని చరణ్ (Ram Charan) ప్రశ్నించగా...'హా కచ్చితంగా ఉంటారు' అని డైరెక్టర్ రాజమౌళి చెప్పారు. అయితే ఆ సినిమా తీయడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చని అన్నారు.


Also Read: RRR Movie Effect: RRR సినిమా ప్రభావం బాలీవుడ్‌పై తీవ్రంగా ఉండనుందా..ఎందుకు


రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ (Jr NTR) కొమరం భీమ్​గా నటించిన పీరియాడికల్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్'. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో నిర్మించారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇటీవల రిలీజ్ అయిన 'కొమురం భీముడో' సాంగ్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. 



Also Read: Salman Khan : పాము మూడుసార్లు కాటు వేసింది.. రాజమౌళితో సినిమా తీయట్లేదన్న సల్మాన్ ఖాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి