RRR Pre Release : ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అంతా రెడీ.. హోస్ట్‌గా బాలీవుడ్ మెగాస్టార్?
RRR Pre Release event host : ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్. ఆదివారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ముంబైలో జరగనుంది. ఇక ఈ మూవీకి హోస్ట్ ఎవరో తెలుసా?
SS Rajamouli’s RRR Pre Release event in Mumbai Bollywood Star Hero to host the event : ఆర్ఆర్ఆర్.. రౌద్రం రణం రుధిరం మూవీ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ.. ఆర్ఆర్‌ఆర్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు కలిసి బ్రిటిష్ వారిపై ఏవిధంగా పోరాటం చేశారనే కోణంలో ఫిక్షనల్ స్టోరీగా రాజమౌళి ఈ మూవీని తెరకెక్కించారు.ఆర్ఆర్‌ఆర్ మూవీ ప్రమోషన్స్ లో (RRR Movie Promotions) జోరు పెంచింది మూవీ యూనిట్. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో వరుస ప్రెస్‌మీట్‌లతో మూవీని ప్రమోట్ చేసింది చిత్ర బృందం.
ఆర్ఆర్‌ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్. ఆదివారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ముంబైలో జరగనుంది. ఇందుకోసం చిత్రబృందం భారీగా ప్లాన్ చేసింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను (Prerelease event) ఒక రేంజ్‌లో నిర్వహించాలి ఫిక్స్ అయ్యాడట జక్కన్న.
Also Read : Ganga Expressway: 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే'కు ప్రధాని మోదీ శంకుస్థాపన
ఇప్పుడు ఆర్ఆర్‌ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్ (RRR Pre Release event host) ఎవరనే విషయంపై చర్చ సాగుతోంది. అయితే బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ (Bollywood hero Salman Khan) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారట. అంతేకాదు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్‌జోహార్ (Karan Johar) ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌తో రాపిడ్ ఫైర్ రౌండ్ (Rapid Fire Round) నిర్వహించనున్నారని టాక్.
Also Read :Close Old Bank Accounts: మీ పాత బ్యాంకు ఖాతాలను వెంటనే క్లోజ్ చేసేయండి.. లేదంటే చాలా నష్టం!
ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ (RRR prerelease event) కోసం ముంబై ఫిల్మ్‌సిటీలో జరుగుతోన్న ఏర్పాట్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ యూనిట్‌లో రామ్ చరణ్‌తో (Ram Charan) పాటు మరి కొందరు ఇప్పటికే ముంబై చేరుకున్నారు.
ఆర్ఆర్‌ఆర్ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 7న రిలీజ్ కానుంది. దక్షిణాది భాషల్లో ఒక్క మలయాళం తప్ప తెలుగు, తమిళ, కన్నడంలో వారి పాత్రలకు డబ్బింగ్ చెప్పుకున్నారు ఎన్టీఆర్, (NTR) రామ్‌చరణ్. హిందీలో కూడా వీరిద్దరి సొంత వాయిస్‌నే వినిపించనున్నారు.
ఇటీవల రిలీజైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ (RRR Trailer) విశేష స్పందన వచ్చి విషయం తెలిసిందే. పలు భాషల్లో రిలీజైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొట్టింది. ఆర్ఆర్‌ఆర్ మూవీలో అలియా భట్, (Alia Bhatt) అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు రూ.450 కోట్ల పైనే ఖర్చు చేసి ఈ సినిమాను నిర్మించారు.
Also Read : Pushpa Day 1 Collection: అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook