SSMB 28 First Schedule Shoot Completed: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలుత అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన కొంత భాగం షూటింగ్ జరగగా తర్వాత రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని, సినిమా నిర్మాత నాగ వంశీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద సంయుక్తంగా ఈ సినిమాను రాధాకృష్ణ, నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్లో కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో పూర్తయిందని త్వరలోనే సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తామని నిర్మాత పేర్కొన్నారు.


దసరా తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని, ఆ షెడ్యూల్లో మహేష్ బాబు, పూజా హెగ్డే పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే తమిళనాడుకు చెందిన అన్బరివ్ మాస్టర్ యాక్షన్ షెడ్యూల్ అద్భుతంగా వచ్చే విధంగా ప్లాన్ చేశారని ఈ సందర్భంగా నాగ వంశీ పేర్కొన్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తామని గతంలోనే అధికారికంగా ప్రకటించారు. 28వ తేదీ ఏప్రిల్ 2023వ సంవత్సరంలో సినిమా విడుదల చేస్తామని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.


ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తప్ప మరి ఎలాంటి విషయం బయటకు రానీయకుండా సినిమా యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళితో కలిసి సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఎలా అయినా ఈ సినిమాతో కూడా అందుకోవాలని మహేష్ ప్లాన్ చేస్తున్నారు.  త్రివిక్రమ్ కూడా చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నారు.


Also Read: Koratala Siva Tension: ఎన్టీఆర్ ఫోన్ వస్తే వణికిపోతున్న కొరటాల.. చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధం?


Also Read: Anchor Lasya Pregnancy: మళ్లీ తల్లవుతున్నా అంటూ అభిమానులకు లాస్య గుడ్ న్యూస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.