SSMB 28 Update: మా సినిమా ఆగలేదోచ్.. మహేష్ మూవీపై నిర్మాత ఆసక్తికర ట్వీట్
SSMB 28 Update: మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు సంబందించిన సెకండ్ షెడ్యూల్ షూటింగ్ గురించి సినిమా నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
SSMB 28 New Update: తెలుగు సినీ పరిశ్రమలో ఒక భారీ ప్రాజెక్టు నిలిచిపోయింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండడంతో బడా హీరోలతో సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలన్నీ తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ తమ సినిమా నిలిచిపోలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్టీఆర్ 30 టీం ఇప్పటికే తాము రత్న వేలుని డిఓపి గా తీసుకున్నామని సాబు సీరిల్ ని ప్రొడక్షన్ డిజైనర్ గా తీసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా చేస్తున్నామని ప్రకటించారు.
ఇప్పుడు తాజాగా మహేష్ బాబు 28 టీం కూడా ఈ విషయం మీద స్పందించింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ప్రారంభమవుతుందని అలాగే మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ఆరంభం అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ఇప్పటివరకు అధికారికంగా పేరు పెట్టలేదు కాబట్టి ప్రస్తుతానికి SSMB 28 అనే పేరుతో సంభోదిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల మీద నాగ వంశీ, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది రెండవ షెడ్యూల్ కూడా ఇప్పటికే ప్రారంభం కావాల్సింది కానీ మహేష్ బాబు తల్లి చనిపోవడంతో ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు.
తర్వాత లండన్ వెళ్లడంతో షూటింగ్ వాయిదా పడింది ప్రస్తుతానికి మహేష్ బాబు లండన్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారని, త్వరలోనే సినిమా షూటింగ్ ఉండే అవకాశం ఉందని ప్రచారం ఉంది. అయితే అనూహ్యంగా ఒక పెద్ద సినిమా కొన్ని అనూహ్య కారణాలతో ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైన నేపథ్యంలో నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చినట్లయింది. దీంతో మహేష్ బాబు సినిమా ఆ సినిమా ఒకటి కాదని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ రావడంతో మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Janhvi Kapoor Hot Pics: జాన్వీ కపూర్ అందాల జాతర.. చీరకట్టులో హాట్ పోజులిచ్చిన జూనియర్ శ్రీదేవి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook