Mahesh Babu, Trivikram Srinivas movie SSMB28 Shooting starts with Fight Scene: సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేష‌న్‌లో మూడో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే అత‌డు, ఖ‌లేజా సినిమాలు రాగా.. తాజాగా SSMB28 (వర్కింగ్ టైటిల్) వస్తోంది. ఈ సినిమా ప్ర‌క‌ట‌న 2022 ఆరంభంలోనే  వ‌చ్చింది. ఇప్ప‌టికి ముహూర్తం కుదిరింది. సెప్టెంబ‌ర్‌లో SSMB28 షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు త‌న పాత్ర కోసం క‌స‌ర‌త్తులు మొదలెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా SSMB28 సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో ఆరంభం కానుందని సమాచారం తెలుస్తోంది. బ‌స్ ఫైట్ సీక్వెన్స్‌తో SSMB28 షూటింగ్ స్టార్ట్ అవుందట. ఇప్ప‌టికే ఈ ఫైట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతుంద‌ని బోగట్టా. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 


SSMB28 సినిమాని హారిక అండ్ హాసినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ మ‌హేశ్ బాబుకి జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ ఇద్దరు మహర్షి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంకు ఎస్‌.ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. SSMB28ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదల కానుంది. మ‌హేశ్-త్రివిక్రమ్ కాంబో కాబట్టి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Also Read: SKY Batting Secret: బహుశా నా బ్యాటింగ్ సీక్రెట్‌ అదేనేమో.. స్నేహితులతో కలిసి..!


Also Read: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ‌.. టాప్‌లో ఎంఎస్ ధోనీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook