Star Heroine: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. హీరోలు, క్రికెటర్స్‌తో ఎఫైర్.. ఇప్పటికీ సింగిల్‌గానే లైఫ్.. ఎవరామె..?
Star Heroine: ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్. చిరు, బాలయ్య సహా అందరి స్టార్ హీరోలతో నటించింది. అంతేకాదు టాలీవుడ్, బాలీవుడ్లో నంబర్ వన్ కథానాయికగా సత్తా చాటింది. అంతేకాదు ముగ్గురు స్టార్ హీరోలు.. ఓ క్రికెటర్‌తో ఎఫైర్ నడిపించింది. కానీ ఇప్పటికీ సింగిల్‌గా లైఫ్ లీడ్ చేస్తోంది.
Tollywood Gossips: 90లలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది నగ్మా. తెలుగులో పెద్దింటల్లుడు సినిమాతో తెరంగేట్రం చేసినా.. చిరంజీవి, దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఘరానా మొగుడు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. కానీ వ్యక్తిగత జీవితం ఎపుడు హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈమె ఆన్ స్క్రీన్ హీరోలతో రొమాన్స్ మాత్రమే కాదు.. బిహైండ్ స్క్రీన్ కూడా రొమాన్స్ చేసినట్టు అప్పట్లో పుకార్లు షికార్లు చేసాయి. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలతో పాటు ఓ క్రికెటర్ కూడా ఉండటం చెప్పుకోదగ్గ అంశమనే చెప్పాలి.
నగ్మా 90లలో యువత కలల రాణి. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ వంటి అప్పటి స్టార్ హీరోలతో నటించి సత్తా చాటింది. అటు కేవలం సినిమాల పరంగానే కాదు.. రాజకీయాల్లోనే సత్తా చాటింది నగ్మా. సినిమాల పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికీ వివాదాస్పదమే. ఈమె నలుగురు పెళ్లైన వాళ్లతో ఎఫైర్స్ నడిపిందనే వార్తలు అప్పట్లో సంచలనే రేపాయి. అందులో ముగ్గురు హీరోలు.. ఓ క్రికేటర్ ఉండటం విశేషం.
1974 హిందూ తండ్రికి ముస్లిమ్ అమ్మకు జన్మించింది నగ్మా. తండ్రి రాజస్థాన్ జైసల్మేర్ రాజకుటుంబానికి చెందిన వారు. ఆ తర్వాత గుజరాత్‌కు, ముంబైకు మకాం మార్చారు నగ్మా కుటుంబం. నగ్మా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, భోజ్‌పురి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడులో ఈమెకు అభిమానులు ఏకంగా గుడి కట్టేసారు. ఈమె వ్యక్తిగత జీవితం కూడా వివాదాలతో ముడిపడి ఉంది.
మీడియా కథనాల ప్రకారం అప్పట్లో టీమ్ ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఈమె ఘాటు ప్రేమాయణమే నడిపింది. అప్పట్లో తిరుపతిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సౌరవ్ భార్య జోక్యంతో వీరిద్దరి ప్రేమ బంధానికీ బ్రేక్ పడింది. ఆ తర్వాత ఎవరి జీవితంలో వారు ముందుకు వెళ్లారు.
సౌరబ్ గంగూలి తర్వాత రాధిక ప్రస్తుత భర్త శరత్ కుమార్‌తో ఈమె కొన్నేళ్లు డేటింగ్ కూడా చేసిందనే వార్తలు వచ్చాయి. రాధిక కూడా శరత్ కుమార్‌కు మూడో భార్య. అప్పటికే రాధిక రెండు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో శరత్ కుమార్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది. శరత్ కుమార్‌కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ఇక రాధిక.. శరత్ కుమార్ జీవితంలోకి రావడంతో నగ్మాతో ఎఫైర్‌తో బ్రేక్ పడిందనే వార్తలు వినిపించాయి.
ఇక తెలుగు, తమిళం, హిందీల్లో నగ్మా హవా తగ్గిన తర్వాత ఈమె భోజ్‌పురి వైపు దృష్టి సారించింది. అక్కడ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఈమె బోజ్‌పురి సూపర్ స్టార్ రవికిషన్ రేసు గుర్రం ఫేమ్‌తో ప్రేమాయణం నడిపింది. రీల్ లైఫ్ వీళ్ల కాంబినేషన్.. రియల్ లైఫ్‌లో కంటిన్యూ అయింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ గట్రా చేసినట్టు బోజ్ పురి మీడియా పుంకాను పుంకానులుగా కథనాలు రాసింది అప్పట్లో. ఇక నగ్మాతో తన ఎఫైర్ గురించి రవికిషన్ ఎపుడు దాచుకోలేదు. అప్పట్లో రవికిషన్ భార్య ప్రీతి.. అతనితో గొడవ పడిందట. ఆ తర్వాత రవికిషన్.. నగ్మాతో ఎఫైర్‌కు ఎండ్ కార్డ్ పడింది.
రవికిషన్‌తో విడిపోయిన తర్వాత నగ్మా మరో బోజ్‌పురి స్టార్ హీరో మనోజ్ తివారీతో లవ్వాయణం నడిపిందనే వార్తలు వచ్చాయి. అప్పట్లో రవికిషన్, మనోజ్ తివారీ మధ్య బోజ్పురిలో పెద్ద పోటీ ఉండేది. అయితే మనోజ్ తివారీ మాత్రం నగ్మాతో సినిమాలు చేసినంత మాత్రానా.. ఎఫైర్స్ అంటకట్టడం ఏమిటి అని అప్పట్లో మీడియాపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలు వచ్చినపుడు సౌరబ్, శరత్ కుమార్, రవికిషన్, మనోజ్ తివారీ అందరు వివాహితులే కావడం చెప్పుకోదగ్గ విశేషం. ఇక రవికిషన్, మనోజ్ తివారీ ఇద్దరు ఇపుడు బీజేపీ తరుపున లోక్‌సభ సభ్యులుగా ఉన్నారు. ఇక నగ్మా కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున రాజకీయాల్లో ప్రవేశించారు. ఈమె ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.\
ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..
ఇదీ చదవండి: ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook