Sudigali Sudheer - Pradeep Hosted Zee Telugu Kutumbam Awards 2022 to Telecast on October 16: ప్రతి ఏడాది ఘనంగా జీతెలుగు సంస్థ జీ కుటుంబం అవార్డుల పేరుతో అవార్డుల ఫంక్షన్ నిర్వహిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ అవార్డులకు సంబంధించిన వేడుక ఘనంగా జరిగింది. ఇక ఈ అవార్డుల వేడుక అక్టోబర్ 16వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2022 పేరుతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది జీ తెలుగు సంస్థ. ఇక ఈ కార్యక్రమానికి శ్రీముఖి, సుడిగాలి సుధీర్. ప్రదీప్ యాంకర్లుగా వ్యవహరించి ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఇక ఈవెంట్లో జీ తెలుగు సీరియల్స్ లో నటించే వారిలో బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ వైఫ్, బెస్ట్ ఫ్యామిలీ, బెస్ట్ హస్బెండ్ లాంటి ఎన్నో కేటగిరీలలో అవార్డ్స్ అందజేశారు. ఈ అవార్డులు వేడుకకు హీరోయిన్లు అంజలి, లక్ష్మీరాయ్ అలాగే జీ తెలుగు సీరియల్స్ లో నటించే అత్తా కోడళ్ళు, హీరో హీరోయిన్లు హాజరయ్యారు.


వీరందరూ కూడా తమదైన శైలిలో స్టేజ్ మీద కూడా పర్ఫామెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. వీరు కాకుండా జి సరిగమప సింగర్స్ కూడా తమదైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే ఇటీవల ప్రారంభమైన డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు కంటెస్టెంట్స్ కూడా తమ ఎనర్జిటిక్ స్టెప్స్ తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ వేడుకలో హీరో నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి, బాబు మోహన్, సాయి కుమార్, తేజ సజ్జా, శ్రీనివాసరెడ్డి, నిహారిక కొణిదెల, ఎస్తేర్, శివబాలాజీ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, మారుతి, తేజ, బింబిసార డైరెక్టర్ వశిష్ట వంటి వారు పాల్గొన్నారు.


ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొట్టమొదటిసారిగా ఈ వేడుక కోసం సుడిగాలి సుధీర్ జీ తెలుగుతో టై అప్ అయ్యారు. ఇక సుధీర్ కు సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇక ఈ విషయం తెలియడంతో సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.


Also Read: Pawan Kalyan's Remake Movie : ఆగిపోయిన పవన్ రీమేక్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు!


Also Read: Vignesh Shivan on Surrogacy: సరోగసీ కామెంట్లపై స్పందించిన విగ్నేష్ శివన్.. అప్పటివరకు ఓపిక పట్టండి అంటూ కామెంట్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook