Cable Reddy First look: ‘కలర్‌ ఫోటో’ ఫేమ్  సుహాస్‌ (Actor Suhas) నయా మూవీ  'కేబుల్‌ రెడ్డి' (Cable Reddy). ఈ మూవీతో శ్రీధర్‌ రెడ్డి (Sridhar Reddy) దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీలో సుహాస్‌కు జోడిగా షాలిని కొండేపూడి (Shalini Kondepudi) నటిస్తోంది. ఈ చిత్రాన్ని  ఫ్యాన్‌ మేడ్‌ ఫిల్మ్స్‌ (Fan Made Films) పతాకంపై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీకి మహిరెడ్డి పండుగల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి  స్మరణ్‌ సాయి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ నుంచి సుహాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కేబుల్‌ రెడ్డి నవ్వులతో మీ గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు అంటూ క్యాప్ష‌న్ కూడా జోడించారు. పోస్టర్ ను బట్టి సుహాస్ ఈ సినిమాలో కేబుల్ ఆప‌రేట‌ర్‌గా ప‌ని చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.  



మరోవైపు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో కూడా సుహాస్ నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీ తెరకెక్కుతోంది. దుశ్యంత్ కటికనేని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ కామెడీ డ్రామాగా రూపొందుతుంది. మరోవైపు క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రల్లోనూ అదరగొడుతున్నాడు సుహాస్. ‘హిట్ 2’ సినిమాలో చేసిన విలన్ రోల్ కు రీసెంట్ గా సైమా అవార్డు కూడా వచ్చింది. 


తొలి సినిమా ‘కలర్‌ ఫోటో’తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. ఈ మూవీ ఓటీటీలో రిలీజై ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత అతడు చేసిన రైటర్‌ పద్మభూషణ్‌ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.


Also Read: Rahul Sipligunj: రతిక రోజ్‌తో పర్సనల్ పిక్స్‌పై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్.. గుట్టురట్టు చేసేశాడు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook