న‌టీన‌టులు: సుమంత్‌, నందిత‌ శ్వేత, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
సంగీతం ‌: సైమ‌న్ కె.కింగ్‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌
మాట‌లు: బాషా శ్రీ
స్క్రీన్ ప్లే అడాప్ష‌న్‌: డా.జి.ధ‌నంజ‌య‌న్‌
క‌థ‌: హేమంత్ ఎం.రావు
నిర్మాణం: క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్
నిర్మాత‌: డా.జి.ధ‌నంజ‌య‌న్
ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి
నిడివి: 2 గంటల 18 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 19, 2021
 
కన్నడలో సూపర్ హిట్ అయిన కవలుధారి సినిమాకు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన కపటధారి మూవీ నేడు థియేటర్లలోకొచ్చింది. Sumanth, Nanditha Shwetha జంటగా నటించిన kapatadhaari movie trailer ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి శాండిల్‌వుడ్ మేజిక్, టాలీవుడ్‌లో రిపీట్ అయిందా? సుమంత్ కెరీర్‌కు మరో హిట్ పడిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ :
గౌతమ్ (సుమంత్) ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్. ఎప్పటికైనా సివిల్ విభాగంలోకి వెళ్లి, ఓ మంచి కేసును ఛేదించాలనేది అతడి కోరిక. కానీ కొన్ని శక్తులు అతడిని సివిల్‌లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంటాయి. అంతలోనే తను డ్యూటీ చేస్తున్న ప్రాంతంలో మెట్రో లైన్ త్రవ్వకాల్లో నాలుగు అస్తిపంజరాలు బయటపడతాయి. ఆ కేసును తనే సొంతంగా డీల్ చేయాలని ఫిక్స్ అవుతాడు గౌతమ్. తనకు తెలిసిన వ్యక్తుల సహాయంతో ఆ కేసు ఫైల్స్ అన్నీ తెప్పించుకొని చదువుతాడు.


ఈ క్రమంలో ఆ అస్తిపంజరాలు 40 ఏళ్ల కిందట చనిపోయిన వ్యక్తులవిగా గుర్తిస్తాడు. పైగా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కేసు అది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు కూడా అంతుచిక్కదు. అప్పట్లో అక్కడ పెద్ద చెరువు ఉండేదని, వరదల వల్ల వాళ్లు చనిపోయి ఉంటారని వాదిస్తారు. మరికొందరు మాత్రం దీన్ని హత్యలుగానే భావిస్తారు. చివరికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా అందరూ గౌరవించే రంజన్ (నాజర్) కూడా ఆ కేసును క్లోజ్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్లిపోతాడు.


చనిపోయిన వాళ్లలో Sampath Raj, అతడి కుటుంబ సభ్యులు ఉంటారు. 40 ఏళ్ల కిందట వాళ్లు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారని తెలుసుకోవాలనుకుంటాడు గౌతమ్. అదే టైమ్‌లో జర్నలిస్ట్ కుమార్ (జయప్రకాష్) ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టిపెడతాడు. ఇంతకీ ఈ కేసుకు కుమార్‌కు ఉన్న సంబంధం ఏంటి? కుమార్-గౌతమ్ ఎలా కలుస్తారు? అసలు ఈ కేసును గౌతమ్ టేకప్ చేయడానికి అసలు కారణం ఏంటి? ఫైనల్‌గా ఈ కేసును గౌతమ్ ఛేదించాడా లేదా అనేదే కపటధారి స్టోరీ.


Also read : Kapatadhaari​​ Theme Trailer: ఆసక్తిరేకెత్తిస్తున్న కపటధారి థీమ్ ట్రైలర్
నటీనటుల పనితీరు :
Sumanth ఈ సినిమాకు పెర్‌ఫెక్ట్‌గా సరిపోయాడు. Subrahmanyapuram, Idam Jagath లాంటి సినిమాల్లో నటించిన అనుభవం, అతడికి కపటధారిగా కనిపించడానికి పనికొచ్చింది. పైగా రీమేక్ మూవీ కావడం వల్ల ఒరిజినల్ చూసి మరింత బాగా నటించాడు. హీరోయిన్ నందిత శ్వేతకు ఈ సినిమాలో నటించడానికి పెద్దగా స్కోప్ దొరకలేదు. ఉన్నంతలో చాలా సన్నివేశాల్లో సైలెంట్‌గా కనిపించింది. నిజానికి హీరోయిన్ లేకపోయినా ఈ సినిమా నడుస్తుంది. కన్నడ నటుడు సంపత్ ఒరిజినల్‌లో చేసిన పాత్రే కావడంతో ఆకట్టుకున్నాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నాజర్ మెప్పించారు. జర్నలిస్ట్ కుమార్‌గా జయప్రకాష్.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా Vennela Kishore తమ పాత్రలకు న్యాయం చేశారు.
 
టెక్నీషియన్స్ పనితీరు :
Pradeep Krishnamurthy దర్శకత్వం సినిమాకు హైలెట్. ఓ మర్డర్ కేసును పోలీసులు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారనే విషయాన్ని డీటెయిల్డ్‌గా ఇందులో చూపించాడు దర్శకుడు. దానికి కాస్త సస్పెన్స్, థ్రిల్ జోడించడం మరింత బాగుంది. హేమంత్ ఈ సినిమాకు కథ రాయగా.. నిర్మాత ధనుంజయన్ స్క్రీన్ ప్లే ఎడాప్షన్ చేశారు. సైమన్ కె.కింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో పెద్ద హైలెట్. తక్కువ పాత్రలు, అతి తక్కువ లొకేషన్స్ ఉన్న ఈ సినిమాకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ తీసుకొచ్చాడు సైమన్. దీనికి సినిమాటోగ్రఫీ కూడా ప్లస్ అయింది. ఎడిటింగ్ డీసెంట్‌గా ఉంది. కథకు తగ్గట్టు నిర్మాతలు ఖర్చు చేశారు.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నంతసేపు బాగుంటాయి. కానీ మరోసారి చూడ్డానికి మనసొప్పదు. కపటధారి సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. ఒక్కసారి చూడ్డానికి ఈ మూవీ బాగుంటుంది. రిపీట్ వాల్యూ మాత్రం ఉండదు. సస్పెన్స్ రివీల్ అయిన సినిమాను ఇంకోసారి చూడడం ఎవరికైనా ఇబ్బందే కదా. అదే కపటధారి సినిమాకు ప్రధాన అడ్డంకి. ఆకట్టుకునే ట్విస్టులు, అల్టిమేట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రతి 10 నిమిషాలకు కథలో ఓ మలుపు, ఆర్కియాలజీ యాంగిల్, ఓ ఐటెంసాంగ్.. ఇలా కపటధారి సినిమాలో అన్నీ ఉన్నాయి. రెగ్యులర్ సినిమా స్టోరీలా ఇందులో పరిచయ కార్యక్రమాలు, ఇంట్రో సాంగ్స్ ఉండవు. నేరుగా కథలోకి వెళ్లిపోతాం. టైమ్ గడుస్తున్నకొద్దీ మంచి నెరేషన్‌తో దర్శకుడు తన కథలోకి ప్రేక్షకుడ్ని లాక్కెళ్లిపోతాడు. అక్కడ్నుంచి క్లైమాక్స్ వరకు కథతో ట్రావెల్ అవుతూ సినిమా చూస్తాం. అదే Kapatadhaari movie కి ఉన్న ప్రధాన బలం.


Also read : Uppena sequel: మరో ఉప్పెన రాబోతుందట..ఉప్పెన 2 కధ ఎలా ఉంటుందో తెలుసా


Murder mystery, థ్రిల్లింగ్ ట్విస్టులు ఉన్న ఈ సినిమాలో కథ-కథనాన్ని టచ్ చేయకుండా మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి ఈ రీమేక్ సినిమాను ఉన్నంతలో బాగానే డీల్ చేశాడు. హీరో కేసు ఫైల్ చదివే టైమ్‌లో పాత్రల్ని కూడా అక్కడికక్కడే చూపించడం, కేసు ముందుకు సాగుతున్న క్రమంలో.. ఫ్లాష్‌బ్యాక్‌ను కూడా అందులోనే చెప్పడం కొత్తగా అనిపిస్తుంది. దీనికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాడ్ అవ్వడంతో కథలో ఎవరైనా ఈజీగా లీనమైపోతాం.


అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ జానర్ సినిమాలకు రీచ్ కాస్త తక్కువ. దీనికితోడు పాత్రలు తక్కువగా ఉండడం, ఆ తక్కువ పాత్రల్లో కూడా తెలిసిన ముఖాలు మరింత తక్కువగా ఉండడం ఈ సినిమాకు మైనస్‌గా చెప్పుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని నటులను తీసుకోవడంతో కొన్ని సందర్భాల్లో  ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీల్ కలిగిస్తుంది. ఆల్రెడీ కన్నడలో Kavaludaari movie చూసినవాళ్లకు ఈ Kapatadhaari telugu movie ఫరవాలేదనిపిస్తుంది. ఆ సినిమా చూడని వారు మాత్రం కపటధారి సినిమాను ఓసారి చూడొచ్చు.


బాటమ్ లైన్ – థ్రిల్లింగ్ ‘కపటధారి’


రేటింగ్ – 2.75/5


Courtesy: జీ సినిమాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook