Rajinikanth: `జైలర్` కు భారీ లాభాలు.. రజినీకి రూ.100 కోట్ల చెక్కు, కాస్ట్‌లీ కారు బహుమతిగా ఇచ్చిన కళానిధి మారన్..
Jailer Movie: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. దీంతో రజనీకి చెక్ తోపాటు కాస్టలీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు నిర్మాత కళానిధి మారన్.
Jailer Movie Success: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajini Kanth) లీడ్ రోల్ లో నటించిన చిత్రం జైలర్ (jailer). నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 10న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మన దేశంలో రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీని సుభాస్కరన్ నిర్మించారు.
జైలర్’ విజయంతో హ్యాపీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ (Kalanithi Maran) నిన్న రజనీకాంత్‌ను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సినిమాకు భారీగా లాభాలు రావడంతో అందులో కొంత భాగాన్ని చెక్ రూపంలో తలైవాకు అందించారు. చెక్‌తో పాటు కళానిధి మారన్ రజనీకి కాస్ట్‌లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని విలువ దాదాపు రూ.1.24 కోట్ల ఉంటుంది. బ్లాక్ కలర్ BMW X7 సిరీస్ కారును కళానిధి మారన్ బహుమతిగా ఇచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాకు రజినీ రూ.110 కోట్ల పారితోషికం తీసుకున్నారు. తాజాగా మరో రూ.100 కోట్ల చెక్ ను ఇచ్చారు నిర్మాత కళానిధి. దీంతో ఈ ఒక్క సినిమాకే తలైవా రూ.210 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని చరిత్ర సృష్టించాడు. దీంతో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా రజనీకాంత్ నిలిచారు. గురువారం ఈ మూవీ రూ.2.4 కోట్లు కలెక్షన్ల సాధించింది. ఈ మూవీ రిలీజైన ప్రతి చోటా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
Also Read: Kushi Movie OTT: ఓటీటీలోకి ఖుషి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook